మినుములలో పెరుగుదలకు అవకాశం లేనట్లే

 


అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు ఎఫ్ఎక్యూ 835 డాలర్లు, ఎస్యూ 920 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించినందున ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 6550, పాత సరుకు రూ.6500, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6400, ఎస్క్యూ కొత్త సరుకు రూ. 6950, దిల్లీలో ఎస్క్యూ రూ. 7325, ఎఫ్ఎక్యూ రూ. 6725, కోల్కతాలో రూ. 6550-6600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం మార్చి 17 వరకు దేశంలో యాసంగి మినుము పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధతో పోలిస్తే 2.74 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 3.46 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందుకు ముఖ్య కారణమేమనగా పెసర, మినుము విస్తీర్ణం పెరిగింది. మే నెల నుండి సరఫరా పెరగగలదు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో రాబడులు అధికంగా ఉండగలవు. తమిళనాడులో కొత్త సరుకు సరఫరా, విదేశాల నుండి దిగుమతులు ఆంధ్రతో పాటు అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో అమ్మకాలు పెరగడంతో ఈ సారి ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పెరగవు. తద్వారా పప్పు మిల్లులు అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా, గుంటూరు, ప్రకాసం జిల్లాలతో పాటు, ఆంధ్ర,తమిళనాడులలోని ఉత్పాదక ప్రాంతాలలో దినసరి 60-70 వేల బస్తాల సరుకు సరఫరా అవుతున్నది. ఇందులో క్రిష్ణా జిల్లా స్థానిక మార్కెట్లలో పాలిష్ మినుములు రూ. 6800, అన్-పాలిష్ రూ. 6500, నంద్యాలలో పాలిష్ సరుకు రూ. 6500, అన్-పాలిష్ రూ. 6300, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 6400, అన్-పాలిష్ రూ. 6200, విజయవాడలో గుండు మినుములు నాణ్యమైన సరుకు రూ. 11,400, మీడియం రూ. 9600, పప్పు రూ. 7800-8800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్ లోని హర్దా, జబల్పూర్ ప్రాంతాలలో మరో రెండు నెలలలో కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగలదు. దీనితో వ్యాపారులు తమ సరుకు నిల్వలు విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతాల పాలిష్ సరుకు డ్యామేజ్ సరుకు రూ. 3800-4200, నాణ్యమైన సరుకు రూ. 5500-6000 మరియు రాజస్తాన్లోని కేక్ట్లో 1000 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 5500-6300, సుమేర్ సర్ పూర్ 200-300 బస్తాల రాబడిపై రూ.5300-5700, ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ, లలిత్పూర్లలో 4-5 వేల బస్తాల రాబడిపై రూ. 5000-6000, రెత్తుల నాణ్యమైన నిల్వ సరుకు రూ. 6400-6550, లారీ బిల్టి రూ. 6700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog