రాబడులు తగ్గడంతో బెల్లం ధరలు పటిష్ఠం

 


మధ్య ప్రదేశ్ లోని కరేళి, నర్సింగాపూర్ ప్రాంతాలలో బెల్లం రాబడులు దాదాపు సమాప్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్ నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 20 శాతం తగ్గాయి. ఇతర రాష్ట్రాలలో రాబడులు పెరగడం లేదు. కాగా మార్కెట్లకు రాబడి అయిన సరుకు చేతుల మీదనే అమ్మకం అవుతోంది. రాబోవు సీజన్లో చెరకు ఉత్పత్తి తగ్గడం, పంచదార ఎగుమతులు పెరగడం వలన వచ్చే సీజన్లో పంచదార ఉత్పత్తి పెరిగే అవకాశం కలదు. ప్రస్తుతం పండుగల సందర్భంగా కిరాణా వ్యాపారుల కోసం డిమాండ్ రావడంతో ధరలు రూ. 100-125 పెరిగాయి.


ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో మార్చి 21 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13,42,513 బస్తాల నుండి 2,45,850 బస్తాలు తగ్గి 10,96,663 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూ బెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7,79,009 బస్తాల నుండి తగ్గి 6,42,574 బస్తాలు, రస్కట్ 57,054 బస్తాల నుండి 23,220 బస్తాలు, చదరాలు 1,06,012 బస్తాల నుండి 92,079 బస్తాలు, రాబిటన్ 1,90,875 బస్తాల నుండి 89,294 బస్తాలు కాగా, కురుపా 20,428 బస్తాల నుండి పెరిగి 21,914 బస్తాలు, రాబిన్ 1,87,117 బస్తాల నుండి పెరిగి 2,26,676 బస్తాలు, లడ్డూ 318 బస్తాల నుండి పెరిగి 515 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ముజఫర్ నగర్ లోని ఉత్పాదక ప్రాంతాలలో తీవ్ర ఎండల కారణంగా కార్మికుల కొరతతో గత వారం 18-20 వేల బస్తాల బెల్లం రాబడిపై ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1120-1240, కురుపా రూ. 1060-1080, లడ్డు రూ. 1150–1170, రస్కట్ 1020-1025, పౌడర్ బెల్లం రూ. 1240-1260 మరియు హాపూర్లో 55-60 వాహనాలు బెల్లం రాబడిపై బకెట్ బెల్లం రూ. 1050-1085 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని లాతూర్లో గత వారం 40-45 వేల దిమ్మల బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ. 2700-2750, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2550-2600, సోలాపూర్లో 18-20 వేల దిమ్మలు సురభి రకం రూ. 2850-2900, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2550-2600, సాంగ్లీలో 20-25 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం రూ. 3400-3550, గుజరాత్ రకం రూ.3500-3550, ముంబై రకం రూ.3600-3700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్నాటకలోని మాండ్యాలో గత వారం 55-60 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 3000, సింగల్ ఫిల్టర్ రూ. 3100, డబుల్ ఫిల్టర్ రూ. 3300, చదరాలు రూ. 3800, మహాలింగపూర్లో 8-10 వాహనాలు సురభి, తెలుపు రకం రూ. 3300–3350, గుజరాత్ రకం రూ.3350-3400, బాక్స్ రకం రూ. 3425-3450, అరకిలో ముక్కలు రూ.3500, శిమోగాలో 18-20 వాహనాలు దేశీ బెల్లం రూ. 3450-3550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 55-60 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ.2900-2950, మీడియం రూ. 2700-2750, నలుపు రూ. 2500-2550 మరియు చిత్తూరులో 40-45 వాహనాల ఎసి సరుకు రాబడిపై సురభి రకం రూ. 3400-3500, సూపర్-ఫైన్ రూ.800 300 సాట్నా రకం రూ. 3100, నలుపు రూ.2600 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలం మార్కెట్లో గత గురువారం 3 వేల బస్తాల బెల్లం రాబడిపై రూ. తెలుపు 30 కిలోలు రకం రూ. 1240-1259, సురభి రకం సరుకు రూ. 1229-1240, ఎరుపు రకం రూ. 1200-1220, పిలకలపాలయంలో 3 వేల బస్తాలు తెలుపు రకం రూ. 1259-1280, సురభి రకం రూ. 1140-1160, ఎరుపు రూ. 1100-1120 మరియు వెల్లూరులో శుక్రవారం నాడు 5-6 వాహనాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 3800-4000, మీడియం రూ.3000-3500, నలుపు రకం రూ. 2500–2600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog