ఏప్రిల్ లో పెరగనున్న మొక్కజొన్న రాబడులు

 

మార్చి 25, 2022 వరకు యాసంగి మొక్కజొన్న విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 3.41 ల.హె. నుండి పెరిగి 3.93 లక్షల హెక్టార్లకు చేరింది. ఏప్రిల్ 15 తరువాత బిహార్లో మరియు చివరి నాటికి జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్లోని తెనాలి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాలలో కొత్త మొక్కజొన్న రాబడులు ఏప్రిల్ రెండవ వారం నుండి ప్రారంభం కాగలవు. అయితే పౌల్ట్రీ పరిశ్రమ మరియు ఎగుమతిదారుల కోసం డిమాండ్ ఉండడంతో ధరలు తగ్గడం లేదు.


కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 20-25 వేల బస్తాల మొక్కజొన్న రాబడి కాగా, స్థానికంగా రూ. 2000-2300, నమక్కల్, ఉడుమల్ పేటె_ డెలివరి 13-14 శాతం నిమ్ము సరుకు రూ. 2400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని కల్లకుర్చి, చిన్నసేలం, శంకరాపురం, ఉలుండరుపేట, తిరుకోవిలూరు ప్రాంతాలలో ప్రతి రోజు 3-4 వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 2150-2250, ఈరోడ్, పొల్లాచి కోసం రూ. 2400-2450, డెలివరి రూ.2425 మరియు దిండిగల్లో దినసరి 4-5 లారీల రాబడి కాగా, రూ. 2200-2250, నమక్కల్ డెలివరి రూ.2400, రాజపాలయం, కోవిల్పట్టి ప్రాంతాలలో 3-4 వాహనాల రాబడి కాగా, రూ. 2150-2200, ఈరోడ్, పొల్లాచి, నమక్కల్ డెలివరి రూ. 2400-2425 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, మడకశిర, కర్నూలు ప్రాంతాలలో కొత్త మొక్కజొన్న స్థానికంగా రూ. 2000-2100, ఈరోడ్, నామక్కల్, ఉడుమల్పేట, బెంగుళూరు డెలివరి నాణ్యమైన సరుకు రూ. 2450-2500, చింతలపూడి ప్రాంతంలో దినసరి 3-4 వాహనాల రాబడి కాగా, రూ.2200-2250, దేవరపల్లి డెలివరి రూ.2450 ధరతో వ్యాపారమెంది. విజయనగరం, సాలూరు ప్రాంతాలలో 8-10 వాహనాల సరుకు రాబడిపై రూ. 2300-2350, విజయనగరం డెలివరి రూ. 2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది. మరియు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, కేసముద్రం ప్రాంతాలలో దినసరి 15 వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 2145-2300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మధ్యప్రదేశ్లోని నీమచ్లో వారంలో 4 వేల బస్తాల రాబడిపై _పచ్చ మొక్కజొన్న రూ.2275-2350, మీడియం రూ. 2215-2230, నిమ్ము సరుకు రూ.2050-2100 మరియు ఉజ్జయినిలో 4–5 వేల బస్తాల రాబడిపై రూ. 2100-2350 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog