మధ్య ప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలోని డబ్రా, దతియా ప్రాంతాలలో కొత్త బఠాణీల రాబడి ప్రారంభం అయింది. దిగుబడి పెరగడంతో వచ్చే నెల నుండి రాబడులు మరింత పెరిగే అవకాశం కలదు.
ధరలు తగ్గిన తరువాత స్థాకిస్టులు ముందుకు వచ్చే అవకాశం కలదు. ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ప్రతి రోజు 10 వేల బస్తాల రాబడిపై రూ. 4500-5100, మహోబాలో 4 వేల బస్తాలు, ఝాన్సీలో 1000 బస్తాలు, ఉరె, రాట్లలో 1500-2000 బస్తాల కొత్త బఠాణీల రాబడి అవతున్నది. ఏప్రిల్ నుండి రాబడులు పెరిగే అవకాశం కలదు. ప్రస్తుతం కొత్త సరుకు రూ. 4200-4700, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 4850-5150, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4750-5050 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు