మిర్చి ధరలపై నాణ్యత ప్రభావం



మిర్చియార్డుకు వచ్చిన నాసిరకం సరకు


 మిర్చి ధరలపై నాణ్యత ప్రభావం చూపుతోంది.యార్డుకు వచ్చే బస్తాల్లో అధిక శాతం నాసిరకంగా ఉండటంతో ధరల్లో కోత పడుతుంది. మరో వైపు ఎగుమతులు ఆశించిన మేర లేకపోవడం ఆ ప్రభావం ధరలపై కనిపిస్తుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ క్రయవిక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. గత వారంతో పోలిస్తే ధర తగ్గినప్పటికీ ఆశించిన ధర లభిస్తుండటంతో రైతులు వచ్చిన పంట వచ్చినట్లు అమ్మకాలకు ముందుకు వస్తున్నారు.


 సోమవారం మొత్తం 1, 01, 802 బస్తాలు యార్డుకు రాగా, ఈ-నామ్ ద్వారా 95, 886 బస్తాలు విక్రయాలు జరిగాయి. లావాదేవీలు ముగిసే సమయానికి యార్డులో 83, 676 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ వెరైటీ 341 రకం ధర రూ. 21,500 నుంచి రూ. 21, 000కు తగ్గింది. 273 రకం మిర్చి ధర రూ. 19, 000 నుంచి రూ. 18, 000కు తగ్గింది. 334, నెంబర్ 5, 4884, సూపర్ 10 రకాల మిర్చి సగటు ధర రూ.7,000 నుంచి రూ. 18, 000 ఉంది. నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ తేజ రకం రూ.7.000 నుంచి రూ. 19, 000, బాడిగ రూ.7,000 నుంచి రూ. 20, 500, దేవనూరు డీలక్స్ రకం రూ.7,000 నుంచి రూ. 20,000, తాలు మిర్చికి రూ. 4,000 నుంచి రూ. 9,500 ధర లభించింది. ఏసీ కామన్ వెరైటీ 334 ధర రూ. 18, 000, 341 రకం రూ. 14, 500, స్పెషల్ వెరైటీ తేజ రకానికి రూ. 9,500 నుంచి రూ. 16,500, బాడిగ రూ. 18,000, తాలు మిర్చికి రూ. 6,000 నుంచి రూ. 6,500 ధర లభించింది. అన్ని రకాల మిర్చి నాణ్యత అంతంత మాత్రంగానే ఉందని, అందువల్ల ధరలు ప్రస్తుతం స్వల్పంగా తగ్గాయని అధికారులు పేర్కొంటున్నారు.

Comments

Popular posts from this blog