గిరాకీ లేక బలపడని బెల్లం ధరలు

 

దేశంలోని బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో హోళి పండుగ సందర్భంగా మార్కెట్లు మూసి ఉన్నప్పటికీ, ధరలలో మందగమనం కొనసాగుతున్నది. ఇందుకు ముఖ్య కారణమేమనగా దేశంలోని వినియోగ రాష్ట్రాలలో హోళి పండుగ డిమాండ్ తగ్గింది. అయితే వచ్చేవారం నుండి రాబోవు ఉగాది పండుగ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.


 ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో మార్చి 14 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12,44,175 బస్తాల నుండి 2,74,163 బస్తాలు తగ్గి 9,70,012 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూ బెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7,14,187 బస్తాల నుండి తగ్గి 5,64,448 బస్తాలు, రస్కట్ 52,852 బస్తాల నుండి 19,219 బస్తాలు, కురుపా 19,241 బస్తాల నుండి 21,092 బస్తాలు, చదరాలు 96,424 బస్తాల నుండి 71,765 బస్తాలు, రాబిటన్ 1,82,881 బస్తాల నుండి 2,16,152 బస్తాలు, పాపిడి 1,77,243 బస్తాల నుండి తగ్గి 76,494 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ముజఫర్ నగర్ గత 15 రోజులలో ఎన్నికలు మరియు హోళి సందర్భంగా కేవలం 5 రోజులు వ్యాపార లావాదేవీలు కొనసాగాయి. మిగతా 10 రోజుల మార్కెట్ మూసి ఉండడంతో రాబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాగా ఇక్కడి నుండి ప్రతి రోజు రాబడులు తగ్గే అవకాశం ఉంది. రెత్తులు బెల్లం తయారీ తగ్గించి, పంచదార మిల్లులకు చెరకు సప్లైని పెంచడమే ఇందుకు ప్రధాన కారణం. గతవారం సోమ, మంగళ, బుధవారాలలో కలిసి 17-18. వేల బస్తాల బెల్లం రాబడిపై ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1105–1200, కురుపా రూ. 1065-1075, లడ్డు రూ. 1160-1180, రసకట్ 1020-1025, పౌడర్ బెల్లం రూ. 1225-1235 మరియు హాపూర్లో 40-45 వాహనాలు దిమ్మల బెల్లం రూ. 1050-1065 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్ లోని అన్ని మార్కెట్లలో హోళి సందర్భంగా మార్కెట్లు మూసి ఉన్నందున సరుకు రాబడి లేనప్పటికీ, ధరలు వృద్ధిచెందలేదు. కరేలిలో గత సోమవారం నుండి శుక్రవారం వరకు 5 వాహనాల సరుకు రాబడి పై ఎరుపు - సురభి మిక్స్ రూ. 2700-2750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని లాతూర్లో గత వారం 25-30 వేల దిమ్మల బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ. 2650-2700, ఎరుపు- నలుపు మిక్స్ రూ. 2550-2580, సోలాపూర్లో 15-16 వేల దిమ్మలు సురభి రకం రూ. 2750-2800,ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2550-2600, సాంగ్లీలో 8-10 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడిపై సురభి రకం రూ. 3400-3500, గుజరాత్ రకం రూ. 3450-3500, ముంబై రకం రూ. 3550-3600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్నాటకలోని మాండ్యాలో గత వారం 45-48 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 2900, సింగల్ ఫిల్టర్ రూ. 3000, డబుల్ ఫిల్టర్ రూ. 3400-3450, చదరాలు రూ.3500, మహాలింగపూర్లో 6-7 వాహనాలు సురభి, తెలుపు రకం రూ. 3350-3400, గుజరాత్ రకం రూ. 3450, బాక్స్ రకం రూ. 3500, అరకిలో ముక్కలు రూ.3550, శిమోగాలో 10-12 వాహనాలు దేశీ బెల్లం రూ. 3450-3525 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 40-42 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ. 3100-3150, మీడియం రూ. 2900-3000, నలుపు రూ. 2580-2600 మరియు చిత్తూరులో 30-35 వాహనాల ఎసి సరుకు రాబడిపై సురభి రకం రూ. 3500, సూపర్-ఫైన్ రూ. 4000, సాట్నా రకం రూ. 3200, నలుపు రూ. 2600-2650 ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని సేలం మార్కెట్లో గత వారం 10-15 వేల బస్తాల బెల్లం రాబడిపై రూ. 30-40 వృద్ధిచెంది తెలుపు 30 కిలోలు రకం రూ. 1280-1300, సురభి రకం సరుకు రూ. 1260-1280, ఎరుపు రకం రూ. 1240-1260, పిలకలపాలయంలో 4 వేల బస్తాలు తెలుపు రకం రూ. 1170-1190, సురభి రకం రూ. 1160-1180, ఎరుపు రూ. 1120-1140 మరియు వెల్లూరులో 3-4 వాహనాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 3900-4000, మీడియం రూ.3650-3700, నలుపు రకం రూ. 2550-2600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog