కొత్త పసుపు రాబడితో తగ్గుతున్న ధరలు

 


వ్యాపారస్తుల కథనం ప్రకారం గత వారం హోళి సందర్భంగా గురువారం నుండి ఆదివారం వరకు మార్కెట్లు మూసి ఉండడంతో రాబడులు తగ్గాయి. అయితే సోమవారం నుండి బుధవారం వరకు నిజామాబాద్, వరంగల్, వికారాబాద్, మెట్పల్లి, జగిత్యాల, కోరుట్ల మరియు మహారాష్ట్రలోని నాందేడ్, హింగోళి, బస్మత్నగర్, జింతూర్లలో రాబడులు పెరిగే అవకాశం ఉన్నందున వాయిదా ధరలు క్షీణిస్తున్నాయి. మార్కెట్ ధరలు తగ్గిన నేపథ్యంలో వాయిదా డెలివరి తీసుకొనే వారు ముందుకు రారు. అయితే ఏప్రిల్ మొదటి వాయిదా సెటిల్మెంట్ తరువాత మందకొడిలో కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉండగలదు.


 ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 8810 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 188 తగ్గి రూ. 8622, మే వాయిదా రూ. 198 క్షీణించి రూ. 8702 వద్ద ముగిసింది. లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఈశాన్య రుతుపవనాల వర్షాలు ఉండడంతో దిగుబడి ప్రతి ఎకరానికి 15-20 క్వింటాళ్లు ఉంది. పంట కోతలు ప్రారంభమైనందున మార్కెట్లలో రెత్తులకు రూ. 7500-9100 ప్రతి క్వింటాలు ధర లభిస్తుంది. దీనితో రాబోవు 2022-23 సీజన్లో విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 

తెలంగాణలోని నిజామాబాద్లో గత సోమ, మంగళ వారాలలో కలిసి 40-45 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై కొమ్ములు మీడియం సరుకు రూ. 5500-6000, నాణ్యమైన సరుకు రూ. 8200-8500, దుంపలు రూ. 5000-6400, కొమ్ములు పాలిష్ సరుకు రూ. 8500-8600, దుంపలు రూ.7700-7800, 

మెట్పల్లిలో 4-5 వేల బస్తాలు కొమ్ములు నాణ్యమైన సరుకు రూ. 5000-7200, దుంపలు రూ. నాణ్యమైన సరుకు రూ. 4500-6000 వరంగల్ 100-150 బస్తాల కొత్త సరుకు రాబడిపై కొమ్ములు రూ. 6600-6700, దుంపలు రూ. 6000-6400,

 కేసముద్రంలో 1000-1200 బస్తాలు కొమ్ములు, దుంపలు రూ. 5500-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. సోమవారం నాడు నిజామాబాద్లో 35-40 వేల బస్తాల కంటే కూడా అధికంగా రాబడులకు అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో సోమవారం నాడు 70 బస్తాల కొత్త సరుకు రాబడిపై ప్రతిభ రకం కొమ్ములు, దుంపలు రూ. 6500 ధరతో వ్యాపారమెంది మరియు 1200-1500 బస్తాల పాత సరుకు రాబడిపై కొమ్ములు, దుంపలు రూ.6600-6800, పుచ్చు రకం కొమ్ములు, దుంపలు రూ. 5000-5500 

కడప మార్కెట్లో గత వారం 3 వేల బస్తాల కొత్త పసుపు రాబడిపై కొమ్ములు రూ. 6700-6800, దుంపలు రూ. 5700-5800, రంగు తగ్గిన నిమ్ము సరుకు రూ. 3500-4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


5 మహారాష్ట్రలోని హింగోలిలో గత సోమ వారం 5 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ.7200-8200, దుంపలు రూ.6800-7000 మరియు సాంగ్లీలో గత వారం 18-20 వేల బస్తాల కొత్త సరుకు రాజాపురి నాణ్యమైన సరకు రూ. 8000- 10,000, మీడియం రూ. 7500-7800, దేశీ కడప మీడియం రూ. 6000-6700, నాందేడ్లో 3 వేల బస్తాలు కొమ్ములు, దుంపలు రూ. 7000-8200 మరియు 1 వేయి బస్తాల పాత సరుకు కొమ్ములు రూ. 7000–7800, దుంపలు రూ. 6200-7000, బస్మత్నగర్లో 1800-2000 బస్తాల కొత్త సరుకు కొమ్ములు రూ.6500-7200, దుంపలు రూ. 5800-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

తమిళనాడులోని ఈరోడ్లో గత వారం 24-25 వేల బస్తాల కొత్త - పాత సరుకు రాబడిపై కొత్త కొమ్ములు రూ. 6555-8489, దుంపలు రూ. 5889-7159, పాత కొమ్ములు రూ. 5619-8094, దుంపలు రూ. 4199-6859 పెరుందరైలో 2000-2500 బస్తాలు కొమ్ములు రూ.6841-8411, దుంపలు రూ. 5323-7141 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog