ఉలువలు

  



గత వారం మిగులు నిల్వలు సమాప్తం కావడం మరియు ఈ ఏడాది విస్తీర్ణం తగ్గడంతో భవిష్యత్తులో ఉలువల ధర పెరిగి రూ. 5500-6000 ప్రతి క్వింటాలుకు చేరే అవకాశం ఉండడంతో స్టాకిస్టులు అప్రమత్తమయ్యారు.


కర్ణాటకలోని మైసూరు, కుష్టిగి, బాగల్కోట్లలో ప్రతి రోజు 4-5 వాహనాల ఉలువల రాబడిపై ధర రూ. 4000-4500, మీడియం రూ. 3800-4000, బళ్లారిలో 200 - 30 బస్తాలు మరియు ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటిలో వారంలో 1-2 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, నగదు కండీషన్ రూ. 4000-4550, విజయవాడ, చల్లపల్లి డెలివరి రూ. 4600 ధరతో వ్యాపారమైంది. సాలూరు, చీపురుపల్లి ప్రాంతాలలో తెలుపు రకం సరుకు రూ. 4100-4200, నలుపు రకం రూ. 4500-4600 ధరతో వ్యాపారమై ఒడీషా కోసం ఎగుమతి అవుతోంది.


కదిరి, అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గ్ ప్రాంతాలలో 1-2 లారీల రాబడిపై స్థానికంగా పె రూ. 3700-3800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఒంగోలు కోసం రవాణా అవుతున్నది. విజయనగరంలో దినసరి 5 వాహనాల కొత్త సరుకు రాబడిపై తెలుపు రకం రూ.4000, నలుపు రకం రూ. 4400-4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog