రెట్టింపైన మినుము పంట విస్తీర్ణం

 

25, మార్చి వరకు దేశంలో యాసంగి మినుముల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.38 ల.హె. నుండి పెరిగి 2.31 ల.హె.లకు చేరింది. దీనితో తమిళనాడు, మధ్యప్రదేశ్ నుండి సరఫరా పెరిగే అవకాశం ఉన్నందున మిల్లర్లు సరుకు నిల్వ చేయడం లేదు. ఎందుకనగా దేశంలో సమృద్ధిగా సరుకు నిల్వలు ఉన్నాయి. ఇప్పటికీ, రబీ సీజన్ సరుకు సరఫరా అవుతున్నది.


అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు ఎఫ్ఎక్యూ 25 డాలర్లు పెరిగి 860 డాలర్లు, ఎస్క్యూ 935 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించినందున ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 6625, పాత సరుకు రూ. 6575, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6375, ఎస్యూ రూ. 7000, దిల్లీలో ఎస్యూ రూ. 7300-7375, ఎఫ్ఎక్యూ రూ. 6700-6775, కోల్కతాలో రూ. 6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళ నాడులో విల్లుపురం ప్రాంతపు సరుకు చెన్నై డెలివరి రూ.7000, తంజావూరు Još 85. 6850-6900, రాయలసీమ సరుకు రూ. 6700 -6800, క్రిష్ణా జిల్లా కొత్త పాలిష్ రకం సరుకు రూ.7000-7050 ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా స్థానిక మార్కెట్లలో పాలిష్ మినుములు రూ. 6800, అన్-పాలిష్ రూ. 6500, నంద్యాలలో పాలిష్ సరుకు రూ. 6500, అన్-పాలిష్ రూ. 6300, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 6400, అన్-పాలిష్ రూ. 6200, విజయవాడలో గుండు మినుములు నాణ్యమైన సరుకు రూ. 11,400, మీడియం రూ. 9600, పప్పు రూ.7800-8800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



మధ్యప్రదేశ్లోని టికంఘడ్ 1000 బస్తాల రాబడిపై రూ. 4500-5700, జబల్ పూర్ లో 500-600 బస్తాల రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ. 6000 -6400, డ్యామేజ్ రకం రూ. 3000 3500, హర్ధాలో మీడియం రూ. 5000 - 5500, ఇండోర్లో రూ. 6300-6400 మరియు రాజస్తాన్ లోని కేక్లో 1000 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 5500 - 6000, సవాయిమాధవూర్లో 200-300 బస్తాల రాబడిపె రూ. 5300-5600, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలిత్పూర్ లలో 1500 -2000 బస్తాల రాబడిప్పె రూ.5500-6500, రెత్రుల నాణ్యమైన నిల్వ సరుకు రూ. 6200 6550, లారీ బిల్టి రూ. 6700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


అకోలాలో మొగర్ రకం సరుకు రూ. 9500-9800, నాణ్యమైన సరుకు రూ. 9900-10,200, జల్గాంవ్ మధ్య ప్రదేశ్ మినుములు రూ. 6500, మహారాష్ట్ర సరుకు రూ. 6900 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog