శనగలు పటిష్ఠం

 

దేశంలో ఉగాది పండుగ సందర్భంగా శనగపప్పుకు గిరాకీ నెలకొనడంతో శనగలు, పప్పు ధరలు రూ. 50-100 ప్రతి క్వింటాలుకు పెరిగాయి.


ముంబైలో టాంజానియా శనగలు రూ. 4451, సూడాన్ సరుకు రూ. 5050–5300 మరియు దిల్లీ లారెన్స్ రోడ్లో గత వారం 95-100 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5150, మధ్య ప్రదేశ్ ప్రాంతపు సరుకు రూ. 5075 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపార మైంది. గుజరాత్ లోని గోండల్లో దినసరి 500 బస్తాలు, జామ్నగర్ 3500 బస్తాలు, జూనాఘడ్లో 2000 బస్తాల రాబడిపె రూ. 3500-4000, నాణ్యమైన సరుకు రూ.4600-5050 ధరతో వ్యాపారమెంది. గత వారం ఆర్థిక సంవత్సర ముగింపు లెక్కల కారణంగా మార్కెట్లలో రాబడులు తగ్గాయి.


ఆంధ్ర ప్రదేశ్ లోని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 50-60 వాహనాల శనగల  రాబడి అవుతన్నాయి. కర్నూలులో జెజె రకం శనగలు రూ. 4600, ఒంగోలు జెజె శనగలు రూ. 4500, కాక్-2 కాబూలీ శనగలు రూ. 6500, డాలర్ శనగలు రూ. 8400 మరియు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతం శనగలు ఈరోడ్ డెలివరి రూ. 5000, కర్ణాటక సరుకు రూ. 5100 ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి 20-25 వేల బస్తాల రాబడిపై స్థానికంగా రూ. 4500-4750 మరియు మహారాష్ట్రలోని లాతూర్లో 20 వేల బస్తాల కొత్త శనగల రాబడిపై విజయ, అన్నిగిరి రూ. 4700-4940, అమరావతిలో 10 వేల బస్తాలు, ఖాంగాంప్లో 4-5 వేల బస్తాలు, అమరావతిలో 3-4 వేల బస్తాలు, కరంజాలో 4 వేల బస్తాలు, దరియాపూర్లో 3 వేల బస్తాలు, జాల్నాలో 4-5 వేల బస్తాలు, ఇతర ఉత్పాదక కేంద్రాలలో కలిసి 20-25 వేల బస్తాల రాబడిపై రూ. P 4400-4600, విశాల్ రూ. 4900, చాపా రకం రూ. 4800 ధరతో వ్యాపారమెంది. రాజస్థాన్ లోని రామంజుండీ లో 7 వేల బస్తాలు సహా, ఇతర ఉత్పాదక కేంద్రాలలో 15-20 వేల బస్తాల రాబడిపై రూ. 4500-4750, జెపూర్లో రూ. 5025, పప్పు రూ. 5825 ధరతో వ్యాపారమెంది. మధ్యప్రదేశ్లోని సాగర్ 2 వేల బస్తాలు, జబల్పూర్లో బస్తాలు సహా, దినసరి 15 వేల బస్తాల రాబడిపే రూ. 4500-4900, a ఇండోర్ దేశీ సరుకు రూ. 5050-5100, డాలర్ శనగలు రూ. 8000-9000, కాబూలీ శనగలు 42-44 కౌంట్ రూ. 9350, 44-46 కౌంట్ రూ. 9200, 58-60 కౌంట్ రూ.8600, 60-62 కౌంట్ రూ. 8500, 62-64 కౌంట్ రూ. 8400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog