పెరిగిన యాసంగి పెసల విస్తీర్ణం

 


 అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 940 డాలర్లు, పొకాకొ 835 డాలర్లు, అన్నేశ్వర్ 800 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ స్థాయిలో స్థిరంగా ఉండడంతో ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీపెసలు సేలం, త్రిచి, డిండిగల్, విరుధ్ నగర్ డెలివరి రూ. 150 తగ్గి రూ. 7200, సాదా రకం రూ. 7050 ధరతో వ్యాపారమెంది. గుజరాత్లో మార్చి 7 వరకు విస్తీర్ణం 8700 హెక్టార్లు ఉంది. మే నెలలో కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగలదు.


 బిహార్ మరియు తమిళనాడులోని తంజావూరు జిల్లాలలో సన్న రకం పెసర రాబడి ఉండగలదు. మే నెలాఖరు నాటికి మధ్య ప్రదేశ్లోని హర్దా, హోషంగాబాద్, జబల్పూర్ ప్రాంతాలలో కొత్త సరుకు రాబడి ప్రారంభం అవుతున్నది. ఈ ఏడాది వర్షాలు సమయానికి కురిసే అవకాశం ఉంది. జూన్ నుండి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలలో పంట సాగు ప్రారంభం కాగలదు. కర్ణాటకలోని గదగ్లో జూన్ చివరి వారం నాటికి యాసంగి పంట రాబడులు ప్రారంభం అవుతాయి. కాబట్టి మే నెల నుండి దేశంలో నిరవధికంగా సరఫరా ఉండగలదు.


వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం మార్చి 17 వరకు యాసంగి పెసర విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 2.74 ల.హె. నుండి పెరిగి 3.46 ల.హె.లకు చేరింది. ఇందుకు ముఖ్య కారణమేమనగా, పెసలు, మినుముల విస్తీర్ణం పెరిగింది. రాజస్తాన్లోని సుమేర్పూర్, కేక్డి, కిషన్ఢ్, శ్రీగంగానగర్ ప్రాంతాలలో 5-6 వేల బస్తాల రాబడిపై రైతులు మీడియం సరుకు రూ. 5000-6000, నాణ్యమైన సరుకు రూ.6500-6800, జైపూర్లో రూ. 6000-7100, పప్పు రూ. 8500-8900, మిటుకులు రూ. 6000-7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని జబల్పూర్లో రూ.5000-7000, హర్దాలో 500-600 బస్తాల పెసల రాబడిపై రూ.4000–7100, పిపరియాలో 1000 బస్తాల రాబడిపై రూ. 6000-6900, కరేళిలో రూ. 6100-6500, ఇండోర్లో రూ. 7200-7300, మహారాష్ట్రలోని అకోలాలో రూ. 6500-7000, మొగర్ పెసలు రూ. 9200-9400, జల్గాంవ్లో మధ్యప్రదేశ్ సరుకు రూ. 6500, మహారాష్ట్ర సరుకు రూ.6700 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog