మినుముల ధరలపై భారీ ఆశ లేనట్లే

 


 గ్రీష్మ కాలంలో మినుముల ఉత్పత్తి గణనీయంగా రాణిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త మినుముల సరఫరా జోరందుకుంటున్నది. మయన్మార్లో పంట సంతృప్తికరంగా ఉన్నందున భారత్ సరఫరా కొనసాగే అంచనాతో ధరలు పురోగమించే అవకాశం లేదు. ఎందుకనగా, అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు 5 డాలర్లు తగ్గి ఎఫ్ఎక్యూ 770 డాలర్లు, ఎస్క్యూ 855 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించినందున ముంబైలో ధర రూ. 100 పెరిగి ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 6300, పాత సరుకు రూ.6200, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6150-6050, పాత సరుకు రూ. 6100, ఎస్యూ కొత్త సరుకు రూ.6750-6550, పాత సరుకు రూ. 6650, దిల్లీలో ఎస్క్యూ రూ. 7050-7100, ఎఫ్ఎక్యూ రూ.6450-6500, కోల్కతాలో రూ. 6250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడు సరుకు చెన్నై డెలివరి రూ.6900-7000, ఆంధ్రప్రదేశ్ పియు-37 రకం రూ. 6700 మరియు 402 రకం సరుకు రూ. 7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణాజిల్లా స్థానిక మార్కెట్లలో పాలిష్ మినుములు రూ. 6800, అన్-పాలిష్ రూ. 6500, నంద్యాలలో పాలిష్ సరుకు రూ. 6600, అన్-పాలిష్ రూ. 6400, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ.6500, అన్-పాలిష్ రూ.6300, విజయవాడలో గుండు మినుములు నాణ్యమైన సరుకు రూ. 11,400, మీడియం రూ. 9300, పప్పు రూ. 7500-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్ లోని హర్దా, జబల్పూర్ ప్రాంతాలలో పాత సరుకు రూ. 3700-4800, నాణ్యమైన సరుకు రూ. 6100 మరియు రాజస్తాన్లోని కేక్, కోటా, సుమేర పూర్ ప్రాంతాలలో రూ.5500-6200, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలితప్పూర్, ఉరై ప్రాంతాలలో రూ. 4550-5850, మహోబా, చందౌసి ప్రాంతాలలో నిల్వ అయిన రైతుల సరుకు రూ.5000-6550, లారీ బిల్టి రూ.6700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog