దక్షిణాదిలో మినుముకి పెరుగుతున్న డిమాండ్- గత వారం మార్కెట్ ధరలు



12-10-2021

అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ ఎఫ్ఎక్యూ 950 డాలర్లు, ఎస్ క్యూ 30 డాలర్లు పెరిగి 1100 డాలర్లు ప్రతి టన్ను ప్రతిపాదించబడింది. అయితే దక్షిణ భారత పప్పు మిల్లర్లు ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల నుండి కొత్త సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకనగా, కొత్త సరుకులో జిగురు అధికంగా ఉండడంతో పాటు తీపిదనం ఉండడం వలన అల్పాహారం తయారీదారుల కోసం అమ్మకాలు అధికంగా ఉంటాయి. ఈ ఏడాది దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో సరుకు క్వాలిటీ డ్యామేజ్ అయింది.


మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ సహా అన్ని రాష్ట్రాలలో కలిసి దినసరి 1 లక్ష బస్తాలకు పైగా మినుముల రాబడి అవుతున్నది. ఇందులో 40-50 శాతం సరుకు డ్యామేజ్తో కూడినది. తద్వారా స్టాకిస్టులు అప్రమత్తమవుతున్నారు. అయితే నాణ్యమైన సరుకును ఎక్కువగా కొనుగోలు చేసే దక్షిణ భారతదేశంలో మరో రెండు నెలలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నందున ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. ఎందుకనగా ప్రభుత్వం సరుకు దిగుమతులు కూడా చేసుకుంటున్నది.రబీ సీజన్ సరుకు డ్యామేజ్ లేకుండా నాణ్యమైనదిగా ఉంటుంది. ఉత్పాదక రాష్ట్రాల మార్కెట్లలో రూ. 4500-5500, తక్కువ డ్యామేజ్ సరుకు రూ. 5800-6000, నాణ్యమైన సరుకు రూ. 6500 -7000 ధరతో వ్యాపారమెంది.


అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ ఎఫ్ఎక్యూ 950 డాలర్లు, ఎస్యూ 30 డాలర్లు పెరిగి 1100 డాలర్లు ప్రతి టన్ను ప్రతిపాదించబడింది. అయితే ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 7050-7075, పాత మినుములు రూ.6950-6975, చెన్నెలో ఎస్యూ రూ. 7800, ఎఫ్ఎక్యూ రూ. 6850, కోల్కత్తాలో ఎఫ్ఎక్యూ రూ. 6900, గుంటూరులో ఎస్యూ రూ. 7875, ఎఫ్ఎక్యూ రూ. 7000 ధరతో వ్యాపారమెంది.


కృష్ణా జిల్లాలో పాలిష్ మినుములు రూ. 7700, సాదా రకం రూ. 7400, 

నంద్యాలలో పాలిష్ సరుకు రూ. 7300, సాదా రకం రూ.7100, ప్రొద్దుటూరు, 

కడప ప్రాంతాలలో పాలిష్ సరుకు రూ. 7200, సాదా రకం 7000 ధరతో వ్యాపారమెంది. 

మహారాష్ట్రలోని లాతూర్లో 5 వేల బస్తాల రాబడిపై రూ. 5000–7300, సోలాపూర్లో 10-12 వేల బస్తాల మినుముల రాబడి పై రూ. 5000-7200, 

 అకోలాలో గుండు మొగర్ రకం రూ. 9900-10,000, మీడియం రూ. 9400-9500 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది.


కర్ణాటకలోని కల్బుర్గిలో గత వారం 4-5 వేల బస్తాల రాబడిపై రూ. 5500-7000, బిదర్, హుమ్నాబాద్ ప్రాంతాలలో 3-4 వేల బస్తాల రాబడిపె రూ. 5000-7000 ధరతో వ్యాపారమైంది.


మధ్యప్రదేశ్లోని జబల్ పూర్, హర్దా, దామోహ్, బినా, సాగర్ ప్రాంతాలలో కలిసి సుమారు 15-16 వేల బస్తాల మినుముల రాబడి పె నాణ్యమైన సరుకు రూ. 6300 -6700, మీడియం రూ. 4000 -4500 ధరతో వ్యాపారమెంది.


రాజస్థాన్లోని కేక్లో 3 వేల బస్తాల మినుముల రాబడిపై రూ. 6000-7500, కోటాలో 2 వేల బస్తాల రాబడిపె రూ. 5500-6700, ఉత్తర ప్రదేశ్ లోని మహోబా, లలిత్ పూర్ లో 2-3 వేల బస్తాల రాబడిపై రూ. 5000-6500, చందోసి, బిల్సీ, బహ్ జోహి, వజీర్ గంజ్ ప్రాంతాలలో రూ. 6600-6700 లోకల్లూజ్ మరియు లారీ బిల్జీ రూ. 7100 ధరతో వ్యాపారమెంది. 


Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు