మినుము కొనుగోళ్లు పెరిగే అవకాశం - గత వారం మార్కెట్ ధరలు
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
18-10-2021
గత వారం దక్షిణాది రాష్ట్రాలలో దసరా పండుగ గిరాకీ ముగిసినందున పప్పు కోసం గిరాకీ కొరవడినందున మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు మినుములు కొనుగోలు చేస్తున్నందున ధరలు నిలకడగా మారాయి. అయితే, తమిళనాడు ప్రభుత్వం రైతుల నుండి మినుములు, పెసలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో ధరలు మందగించే అవకాశం లేదు.
అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు ఎఫ్ఎక్యూ 20 డాలర్లు తగ్గి 930 డాలర్, ఎస్యూ 10 డాలర్లు క్షీణించి 1090 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించబడింది. అయితే, ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త • సరుకు రూ. 7075, పాత సరుకు రూ. 6975, చెన్నైలో ఎస్యూ రూ. 7850, ఎఫ్ఎక్యూ రూ. 6900, కోల్కతాలో - రూ. 6900, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఎస్యూ రూ. 7875, ఎఫ్ఎక్యూ రూ. 7000 ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్రలోని సోలాపూర్, అకల్కోట్, దూద్ని ప్రాంతాల మినుములు చెన్నై డెలివరి రూ. 7650-7700,
కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతం సరుకు రూ. 7600,
బీదర్ ప్రాంతం సరుకు రూ. 7500 మరియు
లాతూర్లో ప్రతి రోజు 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 5000 - 7100,
సోలాపూర్, అకల్కోట్, దూద్ని ప్రాంతాలలో కలిసి 7-8 వేల బస్తాలు రూ. 5000-7200,
అకోలాలో మోగర్ మినుములు బోర్డు సరుకు రూ. 9900-10,000, మీడియం రూ. 9400-9500,
కర్ణాటకలోని గుల్బర్గాలో రూ. 4000-6800,
బీదర్, హుమ్నాబాద్ ప్రాంతాలలో రూ.6200-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా పాలిష్ మినుములు రూ. 7700, అన్-పాలిష్ రూ. 7400,
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు