వేసవితాపంతో వాము వినియోగం తగ్గే అంచనాతో గత వారం గిరాకీ తగ్గి ధర రూ. 400-500 ప్రతి క్వింటాలుకు క్షీణించింది. ఆంద్రప్రదేశ్ లోని కర్నూలు మార్కెట్లో గత సోమవారం నుండి బుధవారం వరకు 5-6 వేల బస్తాల వాము రాబడి కాగా, ఎరుపు రకం సరుకు రూ. 12,000–13,000, తెలుపు రకం రూ.13,500-14,500, ఆకుపచ్చ సరుకు రూ. 17,000-18,000, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 20,000–21,000 మరియు
మధ్య ప్రదేశ్లోని పొహరిలో 150-200 బస్తాల రాబడి పై మీడియం రూ. 8000-8500, మీడియం బెస్ట్ రూ. 11,000–11,500, నీమచ్లో 500-600 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, యావరేజ్ రూ. 10,500-11,000, మీడియం రూ. 12,000-13,000, నాణ్యమైన సరుకు రూ. 14,500-15,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.గుజరాత్లోని జామ్నగర్లో గత సోమవారం నుండి బుధవారం వరకు 3 వేల బస్తాల కొత్త వాము రాబడిపై యావరేజ్ రూ. 10,500-11,000, మీడియం రూ. 11,500-12,250, రంగు సరుకు రూ. 13,500-14,000 మరియు యాసంగి సీజన్ సరుకు రూ. 9500-16,800 మరియు ఊంఝాలో 2 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 10,500-11,000, మీడియం బెస్ట్ రూ. 17,000-17,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు