తగ్గిన వాము ఉత్పత్తి

 


 రాబోయే సీజన్ లో వాము ఉత్పత్తి తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నందున ధరలు ఇనుమడిస్తున్నాయి. ఈ ఏడాది సరుకు నిల్వలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో పంటకు తీరని నష్టం వాటిల్లినందున ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 40-45 శాతం తగ్గగలదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రైతులు వాము పంటను పెకలించి ఇతర పంటల సాగు చేపడుతున్నారు.


 ఎందుకనగా ప్రతి ఎకరం దిగుబడి 2-4 క్వింటాళ్లతో ఆదాయం రూ. 35-40 వేలను అధిగమించడం కష్టతరమని చెప్పవచ్చు. కావున ఇతర పంటలపై ఖర్చు తగ్గడమే కాకుండా ఆదాయం రెట్టింపు లభించగలదని రైతులు అభిప్రాయపడుతున్నారు.

 కర్నూలు మార్కెట్లో మంగళవారం నాడు 80-100 బస్తాల రాబడిపె ఎరుపు రకం సరుకు రూ. 12,000-13,000, తెల్ల సరుకు రూ. 13,500-15,000, నాణ్యమైన సరుకు రూ. 15,5000-17,000 ధర తో వ్యాపారమెంది. మధ్య ప్రదేశ్ లోని నీమలో 700-800 బస్తాల సరుకు రాబడిపై నాసిరకం సరుకు రూ. 8000-8500, మీడియం రూ. 9500-10,000, మీడియం బెస్ట్ రూ. 11,500-12,500, జావ్రాలో మీడియం సరుకు రూ. 9000-9500, నాణ్యమెన సరుకు రూ. 10,200-10,500, గుజరాత్ లోని జామ్ నగర్ మార్కెట్లో 1000-1200 బస్తాలు యావరేజ్ సరుకు రూ. 8000-8500, నాణ్యమైన సరుకు రూ.11,500-11,700, లావు రకం రూ. 120200-12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog