వికారాబాద్, మర్పల్లి, శంకర్పల్లి, సదాశివపేట ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు తగ్గాయి. కర్నూలు, సరిహద్దులో గల కర్ణాటకలోని వాము ఉత్పాదక ప్రాంతాలలో 65–70 శాతం సరుకు అమ్మకమైనట్లు సమాచారం. దీనితో మార్చి చివరివారం నుండి రాబడులు తగ్గగలవు. వేసవిలో వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. పెట్టుబడి అధికంగా ఉండడంతో పాటు డిమాండ్ ఉండడంతో కిరాణా వ్యాపారులు కూడా అమ్మకానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. దీనితో హోల్ సేల్ మార్కెట్లో అమ్మకాలు పెరగడం లేదు.
గత వారం నాణ్యమైన సరుకు రూ. 800-1000, మీడియం, యావరేజ్ రకాలు రూ.200-300 ప్రతి క్వింటాలుకు తగ్గింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో గురు, శుక్ర వారాలలో కలిసి 3500–4000 బస్తాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 12,000-13,200, తెలుపు రూ. 13,500-14,700, మీడియం ఆకుపచ్చ సరుకు రూ. 18,500-19,000, నాణ్యమైన సరుకు రూ. 21,000–23,000 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.
తెలంగాణలోని హైదరాబాద్లో వికారాబాద్, తాండూరు, రంగారెడ్డి ప్రాంతాల నుండి గత వారం 25-30 బస్తాల రాబడిపై మీడియం రూ.9500-10,000, నాణ్యమైన సరుకు రూ. 12,500-13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని నందూర్ బార్లో రాబడులు దాదాపు సమాప్తమయ్యాయి. తద్వారా కేవలం 25-30 బస్తాల కొత్త వాము రాబడిపై యావరేజ్ సరుకు రూ. 9500-10,000, మీడియం రూ. 11,500-12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని పోహరిలో గత వారం 300-400 బస్తాల రాబడిపై నలుపు సరుకు రూ. 6000-7000, మీడియం రూ. 9000-10,000, మీడియం బెస్ట్ రూ. 11,500–12,000, నీమన్లో 400-500 బస్తాల కొత్త సరుకు నలుపు సరుకు రూ.9000-9500, ఎరుపు రకం రూ. 10,000-10,500, మీడియం బెస్ట్ రూ. 11,500-12,000 మరియు 1500-2000 బస్తాల పాత సరుకు యావరేజ్ రూ. 11,500-12,000, మీడియం బెస్ట్ రూ. 13,000-14,000, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 15,000-15,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని జామ్ నగర్లో గత వారం 3-4 వేల బస్తాల కొత్త వాము అమ్మకంపై యావరేజ్ రూ. 10,500-12,000, మీడియం రూ. 12,500-14,000, రంగు సరుకు రూ. 23,000-25,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు