స్థిరత్వం చేకూరుతున్న వాము ధరలు

 


 

గత వారం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో వాము రాబడులు డీలా పడినందున మీడియం సరుకు ధరలు ప్రతి క్వింటాలుకు రూ. 150-200 వృద్ధి చెందగా నాణ్యమైన సరుకు ధరలు చెక్కుచెదరలేదు. 


గుజరాత్లోని జామ్నగర్లో 2-3 వేల బస్తాల వాము రాబడిపై యావరేజ్ సరుకు రూ. 11,500-12,000, మీడియం రూ.12,500-13,000, మీడియం బెస్ట్ రూ. 14,000–14,500, నాణ్యమైన సరుకు రూ. 15,000-15,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో 1400-1500 బస్తాల వాము రాబడి పై మీడియం రూ.15,000-15,500, తెలుపు రూ. 16,000-16,500, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 18,000-20,000, బోల్డు రూ. 22,000-24,000 మరియు తెలంగాణలోని వికారాబాద్ మార్కెట్ లో 1000-1200 బస్తాలు యావరేజ్ సరుకు రూ. 11,500–12,400, మీడియం రూ. 12,700-13,800, మీడియం బెస్ట్ రూ. 14,500–15,000, నాణ్యమైన సరుకు రూ. 16,000–16,500 మరియు మధ్య ప్రదేశ్లోని నీమచ్లో 800-1000 బస్తాలు యావరేజ్ సరుకు రూ. 10,000–11,000, మీడియం రూ. 12,500-13,000, నాణ్యమైన సరుకు రూ. 14,000–14,500, ఆకుపచ్చ సరుకు రూ. 16,000 - 16,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog