ముగిసిన వాము సీజన్



 దేశంలోని ప్రముఖ వాము ఉత్పాదక కేంద్రాల వద్ద పంట కోతలు ముగియడంతో పాటు లాభసాటి ధరలు లభ్యమైనందున దాదాపు 80 శాతం మంది రైతులు తమ సరుకు మార్కెట్లకు తరలించారు. ఫలితంగా గత వారంలో రోజులలో అన్ని మార్కెట్లలో కలిసి 30 వేల బస్తాల సరుకు రాబడి అయింది. మరో నెల రోజులలో రాబడులకు తెర పడగలదు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేనందున ధరలు తగ్గి స్థిరపడ్డాయి. 



గత వారం నాణ్యమైన వాము ధరలు రూ. 1500-2000 మరియు మీడియం మరియు నాసిరకం సరుకు రూ. 300-400 ప్రతి క్వింటాలుకు పతనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో గత వారం 14-15 వేల బస్తాల సరుకు రాబడి పై నలుపు సరుకు రూ. - 12,000-12,500, ఎరుపు రకం రూ. 13,000-13,500, తెలుపు రూ.14,000-14,500, మీడియం రూ. 18,000-20,000, నాణ్యమైన సరుకు రూ.22,000-24,000 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది

తెలంగాణలోని వికారాబాద్లో గురువారం 2000-2500 బస్తాల కొత్త సరుకు రాబడిపై ఎరుపు-నలుపు మిక్స్ రూ. 10,500–11,500, మీడియం రూ. 12,000-13,000, నాణ్యమైన సరుకు రూ. 14,500-15,000, సదాశివపేటలో బుధవారం 40-50 బస్తాలు మీడియం సరుకు రూ. 9500-10,000, మీడియం బెస్ట్ రూ.12,000-12,500, హైదరాబాద్లో వికారాబాద్, తాండూరు ప్రాంతాల నుండి 200-250 బస్తాలు మీడియం రూ.9500-10,000, నాణ్యమైన సరుకు రూ. 12,500-13,000, ఆకుపచ్చ సరుకు మీడియం రూ. 13,500-14,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని నందూర్ బార్ గత వారం 1000-1200 బస్తాల కొత్త వాము రాబడిపై యావరేజ్ సరుకు రూ. 11,500-12,500, మీడియం రూ. 13,000-13,500, మీడియం బెస్ట్ రూ. 13,500-14,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్యప్రదేశ్లోని పోహరిలో గత వారం 1500 బస్తాల రాబడిపై నలుపు సరుకు రూ. 7000-8000, యావరేజ్ రూ. 9500-10,000, మీడియం బెస్ట్ రూ. 12,500-13,500, సీమచ్లో 800-1000 బస్తాల కొత్త సరుకు నలుపు సరుకు రూ. 9000-9500, మీడియం రూ. 11,000-12,000, మీడియం బెస్ట్ రూ. 12,500 మరియు 1500 బస్తాల పాత సరుకు యావరేజ్ రూ. 11,500-12,000, మీడియం బెస్ట్ రూ. 13,000-13,500, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 14,000-14,300, జావ్రాలో 200-250 బస్తాల కొత్త సరుకు రాబడిపై మీడియం రూ. 10,500-11,500, నాణ్యమైన సరుకు రూ. 13,500-14,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని జామ్నగర్లో గత వారం 4-5 వేల బస్తాల కొత్త వాము అమ్మకంపై యావరేజ్  రూ. 10,500-11,000, మీడియం రూ. 15,000–17,200, రంగు సరుకు రూ.23,500-24,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. జామ్నగర్లో నాణ్యమైన సెలెడ్ సరుకు చెప్పవచ్చు. ఇతర మార్కెట్లలో మరో రెండు రాబడులు ముగిసినట్లేనని వారాల వరకు రైతుల సరుకు మీడియం లేదా మీడియం బెస్ట్ రాబడి అయ్యే అవకాశం ఉంది.


Comments

Popular posts from this blog