గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద నాణ్యమైన రకాల ధర రూ. 400-500 వృద్ధిచెందింది. కర్నూలు మార్కెట్లో గత మంగళవారం, శుక్ర వారం కలిసి 1200-1300 బస్తాల వాము రాబడిపై యావరేజ్ సరుకు రూ. 10,500-11,500, తెలుపు రకం రూ.12,000-12,500, మీడియం సరుకు తెలుపు రూ. 13,000–14,000, నాణ్యమైన సరుకు రూ. 15,500-16,000 ధరతో వ్యాపారమైంది.
మధ్య ప్రదేశ్లోని నీమచ్లో గుజరాత్ ప్రాంతం నుండి 800-1000 బస్తాల వాము రాబడిపై మీడియం యావరేజ్ సరుకు రూ. 9000-9500, మీడియం రూ. 10,500-11,000, నాణ్యమైన సరుకు రూ. 12,500-12,700, జావ్రాలో రూ.8000-8500, మీడియం బెస్ట్ రూ. 10,500-11,000, గుజరాత్లోని జామ్నగర్లో వారంలో 4-5 వేల బస్తాల అమ్మ కంపె యావరేజ్ రూ. 8500-9750, మీడియం రూ. 10,000-10,500, మీడియం బెస్ట్ రూ. 11,000-11,750, నాణ్యమైన సరుకు రూ. 13,000–13,300 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు