వ్యాపారస్తుల కథనం ప్రకారం గుంటూరు మార్కెట్లో గతవారం కేవలం 4 రోజుల మార్కెట్లో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు భద్రాచలం ప్రాంతాల నుండి 3.30 లక్షల బస్తాల కొత్త మిరప రాబడిపై ఇందులో 60 శాతం నిమ్ము రకం మరియు 40 శాతం నాణ్యమైన సరుకు రాబడిపై 3.25 లక్షల బస్తాల సరుకు అమ్మకం కాగా, పెద్ద యూనిట్లు మరియు స్టాకిస్టుల కొనుగోళ్లతో అన్ని డీలక్స్ మరియు పౌడర్ రకాల ధర రూ. 200-300 ప్రతిక్వింటాలుకు పెరిగింది. అయితే, తేజ మరియు ఇతర రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. వచ్చే వారం నుండి కొత్త సరుకు రాబడులు పెరిగే అవకాశం ఉంది. నాణ్యమైన సరుకు ధరలు పెరిగే అంచనాతో ప్రస్తుతం అనేక మంది రైతులు మరియు స్టాకిస్టులు తమ సరుకు విక్రయించడానికి ముందుకు రావడంలేదు, ఎందుకనగా ఉత్పత్తి తగ్గడంతో ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుండి ధరల స్థాయి మెరుగ్గా ఉంది.
గుంటూరు కోల్డుస్టొరీజీల నుండి గతవారం నాలుగు రోజుల మార్కెట్లో 1 లక్ష బస్తాల రాబడిపై 75 వేల బస్తాల సరుకు అమ్మకమయింది. ఇందులో అన్ని డీలక్స్ రకాల ధరలు మెరుగ్గా ఉన్నాయి. తేజ, 334, సూపర్-10, సింజెంటా బ్యాడ్గీ, నెం.5 రకాల ధరలు స్థిరంగా ఉండడంతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. వచ్చే వారం నుండి ఆంధ్ర, తెలంగాణాలలో రాబడులు పెరగగలవు. అయితే, ధరలలో ఎక్కువగా తగ్గుదలకు అవకాశంలేదు. ఎందుకనగా, ఉత్పత్తి తగ్గడంతో కోల్డుస్టోరేజీలలో నిల్వచేసే వ్యాపారుల డిమాండ్ ఉండే అవకాశం కలదు. గతవారం కేవలం ఆంధ్ర, తెలంగాణ, కర్నాటకలలో కలసి దాదాపు 11-12 లక్షల బస్తాల వ్యాపారమయింది. ఇంతవరకు జరిగిన వ్యాపారంలో ఇది అధికంగా ఉంది.
గుంటూరు కోల్డు స్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రూ. 13000-15500, డీలక్స్ రూ. 15600-16000, మీడియం బెస్ట్ రూ.11000-12900, సింజెంటా బ్యాడ్గీ రూ.13000 -16500, 355 బ్యాడ్గీ రూ. 15000-18000, నెం.5 రూ. 14000-18000, 334 మరియు సూపర్-10 రకాలు రూ. 14000-17200, మీడియం బెస్ట్ రూ. 12500–13900, మీడియం రూ. 11000-12400, మీడియం మరియు మీడియం బెస్ట్ మరియు అన్ని సీడ్ రకాలు రూ.11000-13000 ధరతో వ్యాపారమయింది. గుంటూరులో కొత్త తేజ మిరప రూ. 14000-16000, డీలక్స్ రూ. 16100-16300, మీడియం రూ. 11000-13900, 355 బ్యాడ్జీ రూ. 13500-17500, డీలక్స్ రూ. 17600-18000, సింజెంటా బ్యాడ్గీ రూ. 13500-17000, నాణ్యమైన డిడి రూ. 14000-18000, డీలక్స్ రకం రూ. 18100-18200, 341 రకం రూ. 14000-18000,2043 రకం రూ. 15000-22500, బులెట్ రకం రూ.12000-14500, రోమి రకం రూ. 12000-14000, నెం.5 రకం రూ. 13000–17000, డీలక్స్ రూ. 17200-17500, 334 మరియు సూపర్-10 రూ. 14000-17000, 273 రకం రూ. 13000-18000, బంగారం రకం రూ. 13000-18000, ఆర్మూరు రకం రూ.12000-18700, 11000–14000, డీలక్స్ రూ.14200-14500, మీడియం బెస్ట్ సీడ్ రకం రూ. 10000 13500, తేజ తాలు రూ. 7000-8500, తాలు రూ.1500-2500, 3000-7500 ధరతో వ్యాపారమయింది.
వరంగల్లో గతవారం 45-50 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై తేజ రూ. 13000-16000, 341 రకం రూ. 14000-18200, వండర్ హాట్ రూ. 14000-16500, 1048 రకం రూ. 12000-1500 నెం.5 రకం రూ. 11500-13000, 334 రకం రూ.12000-14000, 13000–16500, తేజ తాలు రూ. 5000-8300, 341 తాలు రూ. 4000-6500 మరియు 3-4 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై వండర్ హాట్ రూ. 16000–18400, తేజ తాలు రూ. 5000-8500, 341 తాలు రూ. 4000-6500 ధరతో వ్యాపారమయింది.
ఖమ్మంలో వారంలో 1.20 లక్షల బస్తాల కొత్త మిరప రాబడిపై నాణ్యమైన తేజ రూ.16200 మీడియం రూ. 15500-16000, తాలు రూ. 8000-8500 మరియు 7-8 మేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ రూ. 16500, తాలు రూ. 7000-7500 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.
హైదరాబాద్లో గతవారం 30-35 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ 12000-16000 బ్యాడిగి రూ. 15000-26000, 273 రకం మీడియం బెస్ట్ రూ. 10000-15000, సూపర్-10 రకం మీడియం రూ. 10000-15000, నాణ్యమైన సరుకు రూ. 18000, నిమ్ము రకం సరుకు రూ. 8000-12000 మరియు కోల్డుస్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన సూపర్ -10రూ. 18000-16500, 341 రకం రూ. 10000-17000, సి-5 రూ.10000-15500, డిడి రూ. 10000-18000, నాణ్యమైన తేజ తాలు రూ. 9000, తాలు రూ. 5000-7500, హైబ్రిడ్ తాలు రూ. 2000–5000 ధరతో వ్యాపారమయింది.
కర్నాటకలోని బ్యాడ్గీ లో సోమ, గురువారాలలో కలిసి 4.14 లక్షల బస్తాల కొత్త మిరప రాబడిపై డబ్బీ డీలక్స్రూ. 40000-48000, నాణ్యమైన డబ్బీ రూ. 38000-13000, కెడిఎల్ డీలక్స్ రూ. 30000-35000, మీడియం బెస్ట్ రూ.23000-26000, మీడియం రూ. 8500-10500, 2043 డీలక్స్ రూ. 21000-25000, మీడియం బెస్ట్ రూ. 18000-22000, నాణ్యమైన 5531 రకం రూ. మీడియం రూ. 10000-12000, డిడి రూ. 14500-18200, 355 రకం రూ.15000-18000, కెడిఎల్ తాలు రూ. సీడ్ తాలు రూ.4500- 8500 మరియు సిందనూర్లో మంగళవారం 20 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై డబ్బీ రూ. 30000-32000, బ్యాడ్గీ రూ.25000-30000, సింజెంటా రూ. 17000-22000, జిటి మరియు సూపర్ -10 రకాలు రూ. తాలు రూ. 2000-6000 మరియు
మహారాష్ట్ర లోని నందూర్ బార్లో దినసరి 4-5 వేల క్వింటాళ్ల నిమ్ము రకం రాబడిపై విఎన్ఆర్ రూ.2800-3400,5531 రకం రూ. 3000 - 3450, తేజ రూ. 3000 ధరతో వ్యాపారమయింది.
మధ్యప్రదేశ్లోని బేడియాలో బుధ మరియు గురువారాలలో కలిసి 60-70 వేల బస్తాల రాబడిపై మహీ ఫూల్ కట్ రూ. 10000-14000, తొడిమతో రూ. 10000-12000, లాల్కట్ రూ. 7500-10000, ఫూల్ కట్ తాలు రూ. 6500-7500, తొడిమతో తాలు రూ. 5500–6500 మరియు ధామనోద్లో గురువారం 15 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన 720 రకం రూ. 12500-15000, మీడియం రూ. 12000-1500, సన్నరకం తాలు రూ. 6000-7000, లావు తాలు రూ.5000-8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయింది.
ఛత్తీస్ఘడ్ లోని జగదల్పూర్లో గతవారం 5-6 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజు మరియు స రూ.14500-15800, 4884 రకం రూ. 12500-13500, తేజ తాలు రూ. 7500-8000 ధరతో వ్యాపారమయింది.
తమిళనాడులోని రామనాథపురం లో గురువారం 40-50 బస్తాల కొత్త సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 25000-27000, మీడియం రూ. 18500-20000 మరియు తిరునల్వేలి, శంకరన్ కోవిల్, కోవిల్ పట్టి ప్రాంతాలలో దినసరి 300-400 బస్తాల రాబడిపై రూ.11500-12000, మీడియం రూ. 8400-9000 ప్రతిక్వింటాలు వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు