వాము పటిష్టం

 


ఆంధ్రలోని వాము ఉత్పాదక కేంద్రాలలో ఇతర రాష్ట్రాల ప్యాకింగ్ తయారీదారుల డిమాండ్ రావడంతో నాణ్యమైన వాము ధర రూ. 800-1000 పెరి గింది. మరోవైపు మధ్య ప్రదేశ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో గిరాకీ తక్కువగా ఉంది. ఎందుకనగా మధ్య ప్రదేశ్లో యాసంగి పంట రాబడులు ప్రారంభం అయ్యాయి. 


ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో గత వారం 7-8 వేల బస్తాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 11,000–12,000, తెలుపు మీడియం రూ. 12,500–14,000, ఆకుపచ్చ రూ. 16,000-18,000, నాణ్యమైన ఆకుపచ్చ సరుకు రూ. 19,500-20,000, మిషన్ క్లీన్ రూ. 22,000-22,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మధ్య ప్రదేశ్లోని పొహరిలో గత వారం 300-400 బస్తాల రాబడిపై మీడియం రూ. 8000-8500, మీడియం బెస్ట్ రూ. 11,500-12,000, నీమచ్లో 1000-1200 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా యావరేజ్ రకం రూ. 10,000-10,500, మీడియం రూ. 11,500–12,000, నాణ్యమైన సరుకు రూ. 13,500–14,000, ఆకుపచ్చ సరుకు రూ.14,800–15,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

గుజరాత్లోని జామ్నగర్లో గత వారం 6-7 వేల బస్తాల కొత్త వాము రాబడిపై యావరేజ్ రకం రూ. 8500-10,000, మీడియం రూ. 11,000-12,250, నాణ్యమైన రంగు సరుకు రూ. 13,500-14,000 మరియు యాసంగి సీజన్ సరుకు రూ. 9500-16,500 మరియు ఊంఝాలో 1800-2000 బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 9000-9500, మీడియం బెస్ట్ రూ. 15,000-15,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog