హెచ్చుముఖంలో వాము
దేశంలో ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడం మరియు స్థానిక, ఎగుమతి డిమాండ్ పెరగడంతో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. నాణ్యమైన రకాల ధరలు తగ్గే అవకాశంలేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
గుజరాత్లోని జామ్నగర్లో 3-4 వేల బస్తాల ఎండాకాలం సరుకు రాబడిపై యావరేజ్ రూ. 11500-12000, మీడియం రూ.12500-13000, మీడియం బెస్ట్ రూ. 14000-14500, నాణ్యమైన సరుకు రూ. 15000-15250 ధరతో వ్యాపారమయింది.
కర్నూలులో గతవారం 3-4 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన రకాలకు డిమాండ్ ఉండడంతో ధరలు రూ.800-1000 పెరిగి మీడియం రూ. 15000-15300, తెలుపు రూ. 15500-16200, నాణ్యమైన సరుకు రూ. 18000-20000, బోర్డు రకం రూ.25500-26000 మరియు వికారాబాద్ లో 800-1000 బస్తాల రాబడి పె యావరేజ్ రూ. 11500-12000, మీడియం రూ. 12500-13500, మీడియం బెస్ట్ రూ. 14500–15200,
మధ్య ప్రదేశ్లోని నిమచ్లో వారంలో 700-800 బస్తాల రాబడి పె యావరేజ్ రూ. 10000-11000, మీడియం రూ. 1200-13000, నాణ్యమైన సరుకు రూ.14500–15200, ఆకుపచ్చ సరుకు రూ. 16000-16500 మరియు మహారాష్ట్రలోని నందూర్ బార్లో 50-60 బస్తాల అమ్మకంపై మీడియం రూ. 13000–13200, మీడియం బెస్ట్ రూ. 13500–14000 ధరతో వ్యాపారమయింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు