విస్తృతంగా పెరిగిన చెరుకు సేద్యం - మిల్లర్లపై భారం
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
2022-23 సీజన్ కోసం దేశంలో చెరకు సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 54.42 ల.హె. నుండి 54.67 ల.హె.కు విస్తరించిందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. వృద్ధి చెందిన విస్తీర్ణం స్వల్పమే అయినప్పటికీ సాధారణంతో పోలిస్తే 15.39 అధికమని చెప్పబడుచున్నది. అయితే, ఈసారి చెరకు సేద్యం ఉపగ్రహ ఛాయాచిత్రం ఆధారంగా గత ఏడాదితో పోలిస్తే 55.83 ల.హె. నుండి 4 శాతం వృద్ధి చెంది 58.28 ల.హె.కు విస్తరించిందని భారత పంచదార మిల్లర్ల సమాఖ్య (ఐఎస్ఎంఎ) పేర్కొన్నది. దీనిని బట్టి రాబోయే సీజన్లో పంచదార ఉత్పత్తి కూడా భారీగానే ఉండగలదని స్పష్టమవుతున్నది.
కేంద్ర సర్కారు ధరల నియంత్రణ విధానం వలన గడిచిన మూడు సంవత్సరాలుగా సరుకు నిల్వ చేసేందుకు స్టాకిస్టులు ఆసక్తి కనబరచడంలేదు. ఇనుమడిస్తున్న పంచదార ఉత్పత్తితో పాటు అంతర్జాతీయ విపణిలో చౌక ధరతో భారత సరుకు సరఫరా చేస్తున్నందున ఎగుమతులకు డిమాండ్ నెలకొంటున్నది. అయితే, రాబోయే సీజన్లో ఇలాంటి పరిస్థితి నెలకొనే అవకాశం కనిపించడంలేదు. అంతేకాకుండా బెల్లం తయారీదారులు మరియు స్టాకిస్టులకు రాబోయే సీజన్లో లాభసాటి ధరలు గిట్టుబాటయ్యే అవకాశం లేదు. ఇతర సరుకులతో పోలిస్తే బెల్లం నిల్వలపై చెప్పుకోదగ్గ లాభాలు లేవని వ్యాపారులు వాపోతున్నారు. కావున కొత్త సీజన్లో స్టాకిస్టులు మార్కెట్లో కనుమరుగయ్యే అవకాశం తథ్యమని స్పష్టమవుతున్నది. 2022-23 సీజన్ కోసం కేంద్ర ప్రభుత్వం చెరకు సముచిత లాభదాయక ధర (ఎస్ఆర్పి) 10.25 శాతం పంచదార రికవరీ ఆధారంగా ధర ప్రతి క్వింటాలుకు రూ. 305 నిర్ధారించింది. అయితే మిల్లు గేటు వద్ద పంచదార అమ్మకం ధర ప్రతి క్వింటాలు రూ. 3100 యధాతథంగానే కొనసాగిస్తున్నది. దీని వలన పంచదార మిల్లులకు పెంచిన ఎస్ఆర్పి శిరోభారం కాగలదని ఐఎస్ఎంఎ వాపోతున్నది. ఈసారి చెరకు పంటకు సమృద్ధిగా అందుబాటులో ఉన్న జలసిరులు, సానుకూల వాతావరణం మరియు ఇనుమడించిన ఎస్ఆర్పి తో రైతులకు ప్రయోజనం చేకూరగలదు. తద్వారా పెరిగిన చెరకు దిగుబడులతో ఇబ్బడిముబ్బడిగా లభ్యత ఉండగలదు. మొత్తం ఉత్పత్తిని పెంచిన ఎస్ఆర్పి ధరతో కొనుగోలు చేసేందుకు మిల్లర్లపై ఒత్తిడి పెరగగలదు. దేశంలో పంచదార వార్షిక వినియోగం 248 ల.ట. కాగా ఉత్పత్తి 350-360 ల.ట.కు చేరగలదని భావిస్తున్నారు. సాధారణంగా పంచదార దిగుబడి 4 శాతం హెచ్చు-తగ్గులు ఉంటుండగా ప్రస్తుత సీజన్లో 15 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఐఎస్ఎంఎ పేర్కొన్నది. చెరుకు రైతులు మరియు మిల్లర్లపై ఈ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది మే నెల చివరి దాకా మహారాష్ట్రలో క్రషింగ్ ప్రక్రియ కొనసాగింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినందున సరుకులో రికవరీ శాతం పడిపోయింది. కొందరు రైతులైతే పంటను పొలంలోనే కాల్చివేయాల్సిన దుస్థితి నెలకొన్నదని ఐఎస్ఎంఎ తెలిపింది.
గడిచిన నెల రోజులుగా ప్రపంచ మార్కెట్లో పంచదార ధర 9 శాతం తగ్గగా ప్రస్తుతం న్యూయార్క్ ఐసిఇ ఎక్స్ంజీ వద్ద ముడిపంచదార ధర ప్రతి పాండు 17.96 సెంట్లు మరియు టన్ను ధర 399 డాలర్ మరియు లండన్ ఎక్స్టెంజి వద్ద 545.70 డాలర్ కొనసాగుతున్న ఇలాంటి తరుణంలో సబ్సిడీ ధర గల సరుకు ఎగుమతులు కూడా కుంటుపడే అవకాశం ఉంది.2021-22 సీజన్లో ఉత్పత్తి అయిన మొత్తం చెరకు ప్రభుత్వం నిర్ధారించిన ఎఫ్ఆర్పి తో మిల్లులు కొనుగోలు చేయవలసి వచ్చింది. దీని వలన గిడ్డంగులలో పంచదార నిల్వలు పేరుకుపోయాయని మిల్లర్లు తెలిపారు.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు