పంచదార ఎగుమతులకు అనుమతి

 



న్యూ ఢిల్లీ - కేంద్ర ప్రభుత్వం పంచదార ఎగుమతుల నిబంధనలను సడలించి ఎగుమతిదారులు, మిల్లులకు ముడి పంచదార షిప్మెంట్ కోసం ఇవ్వబడే పర్మిట్ క్రింద పంచదార షిప్మెంట్కు ప్రత్యామ్నాయం ఇవ్వడంతో కొన్ని మిల్లులకు - అనుకూలంగా మారింది. ఎందుకనగా 100 లక్షల టన్నులకు పైగా పంచదార ఎగుమతికి అనుమతి ఇవ్వడంపై సందేహ పరిస్థితి ఉండడంతో ముందు నుండే ముడి పంచదార నుండి రిఫెండ్ సరుకు తయారు చేయడం జరిగింది.


ఆగస్టు 17న ఆహార మంత్రిత్వ శాఖ వారు జారీ చేసిన నోటిఫికేషన్లో రిఫైనరీలు, పంచరార మిల్లులు, ఎగుమతిదారులకు ముడి పంచదార లేదా రిఫెండ్ సరుకుకు అనుమతి ఇవ్వవచ్చని కస్టమ్స్ అధికారులకు స్పష్టం చేయడం జరిగింది. అక్టోబర్ 31 వరకు సుమారు 78 పంచదార మిల్లులకు నేరుగా ఎగుమతిదారుల మాద్యమంగా 4,30,563 టన్నుల ముడి పంచదార ఎగుమతికి అనుమతి ఇవ్వడం జరిగింది. రాబోవు 3-4 నెలలలో ముడి సరుకు ఎగుమతి కాకపోయినట్లయితే, పై ఉత్తర్వులు రద్దు చేయబడతాయని ఇంతకు ముందే తెలియజేయబడింది. అయితే ఆగస్టు 17న జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం ముడి సరుకుతో పాటు రిఫెండ్ సరుకు ఎగుమతికి కూడా అనుమతి లభించింది. జూన్ 1 నుండి పంచదార ఎగుమతులను నియంత్రిత శ్రేణిలో ఉంచగా, అక్టోబర్ 31 వరకు కొనసాగగలదు.

Comments

Popular posts from this blog