మరో రెండు,మూడేళ్ల వరకు పంచదార ధరలకు నో ఛాన్స్

 


20-02-2022

ఇథనాల్ తయారీకి చేయూత నందించినప్పటికీ మరో రెండు మూడేళ్ల వరకు పంచదార ధరలు ఇనుమడించే అవకాశం కనిపించడం లేదని మిల్లర్లు మరియు వ్యాపారులు తమ అభిప్రాయం వెల్లడించారు. పంచదార ఉత్పత్తితో పాటు ఎగువుతులు పురోగమించనందున దిగ్గజ స్టాకిస్టులు మార్కెట్ నుండి కనుమరుగయ్యారు. దిగ్గజ వ్యాపారులు కూడా తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు.





 దేశంలో అత్యంత దిగుబడులు రాణిస్తున్నాయని భారత పంచదార మిల్లర్ల సమాఖ్య (ఐఎస్ఎంఎ) పేర్కొన్నది. ఇథనాల్ తయారీ కోసం చెరకు మళ్లించినప్పటికీ పంచదార సరఫరాకు ఎలాంటి అంతరాయానికి అవకాశం ఉండదు. తద్వారా మరో రెండు-మూడేళ్ల వరకు పంచదార ధరలు పురోగమించే అవకాశం లేదని వ్యాపారులుభావిస్తున్నారు. ఇథనాల్ తయారీ కోసం చెరకును మళించినప్పటికీ పంచదార ఉత్పత్తి ఇనుమడిస్తూనే ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. చెరకు ఉత్పత్తి సమృద్ధిగా రాణిస్తున్నంత కాలం అదనపు నిల్వలు పేరుకుపోతూనే ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం పంచదార సీజన్ భారత్ (2021 అక్టోబర్ - 2022 సెప్టెంబర్) 82 ల.ట. మిగులు నిల్వలతో ప్రారంభం కాగా, ప్రస్తుత సీజన్లో 3.15 కోట్ల టన్నులు కలిసి మొత్తం సరుకు లభ్యత సుమారు 4 కోట్ల టన్నులు అందుబాటులో ఉండగలదని తెలుస్తోంది. ఇందులో దేశీయ వార్షిక వినియోగం 2.65 కోట్ల టన్నులు, ఎగుమతులు 60 వ్యాఖ్యానిస్తున్నారు. ల.ట. కలిసి మొత్తం 3.25 కోట్ల టన్నులు పోను 70-75 ల.ట. టన్నులకు తగ్గకుండా మిగులు నిల్వలతో 2022-23 సీజన్ ప్రారంభం కాగలదు.


ఏయేటికాయేడు విస్తరిస్తున్న చెరకు సేద్యంతో వృద్ధి చెందుతున్న ఉత్పత్తి మరియు దిగుబడులను దృష్టిలో పెట్టుకొని స్టాకిస్టులు సరుకు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచకపోవడంలో అతిశయోక్తి లేదు. వాతావరణంలో సంభవిస్తున్న పరిణామాలు మరియు ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని వినియోగం వృద్ధి చెందే అంచనా కూడా వ్యక్తం కావడంలేదు. ఈసారి బ్రెజిల్లో పంచదార ఉత్పత్తి కుంటుపడినందున నుండి ఎగుమతులు ఇనుమడిస్తున్నాయి. అయితే, వచ్చే ఏడాది బ్రెజిల్ తమ సాధారణ ఉత్పత్తి కొనసాగించగలదని అప్పుడు పరిస్థితి మరింత దయనీయంగా మారగలదని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా సమృద్ధిగా ఉండగలదని విశ్లేషకులుజాతీయ బయో- ఇంధన విధానాన్ని ప్రభుత్వం 2018 లో ప్రకటించింది.. తాజా బడ్జెట్లో కూడా ఇథనాల్ మిళితం ప్రక్రియకు ఊపిరిలూదింది. దీని వలన 34ల.ట. పంచదారకు సరిపడే చెరకును ఇథనాల్ తయారీకి మళ్లించబడుతున్నది. అయినప్పటికీ 3.65 కోట్ల టన్నుల పంచదార ఉత్పత్తి కావడం తథ్యమని  స్పష్టమవుతున్నది.




Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు