అంతర్జాతీయంగా పెసర ధరలు పటిష్ఠం

 


దేశంలోని ప్రముఖ పెసల ఉత్పాదక రాష్ట్రాలలో ఖరీఫ్, రబీ పెసల రాబడులు తగ్గడం, డిమాండ్ పెరగడం వలన అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ద్వారా డిమాండ్ రావడంతో పేడేశ్వర్ 40 డాలర్లు పెరిగి 940 డాలర్లు, పొకాకో 835 డాలర్లు మరియు అనిశేవా 25 డాలర్లు పెరిగి 800 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో ఆంధ్ర ప్రాంతపు సన్నరకం నాణ్యమైన చమ్కీపెసలు సేలం, త్రిచి, డిండిగల్, విరుధ్ నగర్ ప్రాంతాల డెలివరి ధర రూ. 150 పెరిగి రూ.750, సాదా రూ. 7200 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది. 


ఈ ఏడాది 11 మార్చి వరకు దేశంలో యాసంగి పెసర విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.50 ల.హె. నుండి పెరిగి 1.55 ల.హె.లకు చేరింది. గుజరాత్లో కొత్తసరుకు మే నెలలో, మధ్యప్రదేశ్లో జూన్ మొదటి వారం నుండి రాబడి కాగలదు. ఇదే విధంగా బిహార్లో ఏప్రిల్ చివరి వారానికి కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగలదు. అయితే పై ప్రాంతాల సరుకు ఢిల్లీ కోసం ఎక్కువగా రవాణా అవుతుంది. రాజస్తాన్లోని సుమేర్పూర్, కే, కిషన్ ఘడ్, శ్రీగంగానగర్ ప్రాంతాలలో దినసరి 6-7 వేల బస్తాల రాబడిపై రైతుల మీడియం సరుకు రూ. 5000-6200, నాణ్యమైన సరుకు రూ. 6500-7100, జైపూర్లో రూ. 6000–7000, పప్పు రూ. 8400 8900, మిటుకులు రూ. 6000-7100 ధరతో వ్యాపారమయింది.


మధ్య ప్రదేశ్లోని జబల్పూర్లో రూ. 500 0-7200, హరదాలో 1000-1200 బస్తాల సరుకు రాబడిపై రూ. 4000 -7100, పిపరియాలో 1500 బస్తాల రాబడిపై రూ. 6000-6900, ఇండోర్లో రూ. 7200-7500, అకోలాలో రూ. 6500-7100, మోగర్ పెసలు రూ. 9200-9400 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు