కొత్త పెసల రాబడులు ప్రారంభం - తగ్గిన విస్తీర్ణం

 

Greengram, పెసర

 దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సెప్టెంబర్ 2 నాటికి పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 34.38 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 32.97 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. ఇందులో రాజస్థాన్ లో 20.87 ల.హె. నుండి తగ్గి 20.53 ల.హె.లకు చేరగా,


కర్ణాటకలో 4.10 ల.హె., మహారాష్ట్రలో 2.77 ల.హె., మధ్య ప్రదేశ్ లో 2.03 ల.హె., రాజస్థాన్ లో 97,815 హెక్టార్ల నుండి తగ్గి 79,063 హెక్టార్లకు చేరింది.

కర్ణాటక, మహారాష్ట్రలలో కొత్త సరుకు రాబడులు పెరగడంతో ధరల పెరుగు దలకు అడ్డుకట్ట పడింది. గదగ్, ధారా వాడ్, హుబ్లీ ప్రాంతాలలో 90-10 రకం కొత్త చమ్కీ పెసలు చెన్నై డెలివరి రూ. 7400-7500, 80-20 రకం రూ. 7300, మిల్లు రకం రూ. 6650 ధరతో వ్యాపారమెంది.

కర్ణాటకలోని బాగల్ కోట్ లో దినసరి 6-7 వేల బస్తాలు, గదగ్ లో 7-8 వేల బస్తాలు, కల్బుర్గిలో 2-3 వేల బస్తాలు, యాద్ లో 3-4 వేల బస్తాలు, బీదర్ లో 500-600 బస్తాలు, రాయిచూర్, బసవకళ్యాణ్, హుబ్లీ తదితర ప్రాంతాలలో కలిసి 5-6 వేల బస్తాల రాబడిపె రూ. 6000-7400 ధరతో వ్యాపారమెంది.

 ఆంధ్రప్రదేశ్ లోని పొన్నూరులో పెసలు పాలిష్ సరుకు రూ. 6950, అన్-పాలిష్ రూ. 6750, మధ్య ప్రదేశ్ లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతి రోజు 14-15 వేల బస్తాల పెసల రాబడిపై రూ. 5500-6450, ఇండోర్ లో రూ. 6300-6400, జలాం లో మధ్య ప్రదేశ్ పెసలు యాసంగి సరుకు రూ. 6000, మహారాష్ట్ర నాణ్యమైన సరుకు 6500 మరియు 

కర్ణాటకలోని గుల్బర్గా పెసరపప్పు బెంగుళూరు డెలివరి రూ. 8500-8600, రాజస్తాన్ పెసలు రూ. 8200-8300 మరియు రాజస్తాన్ లోని కేడి,జోధ్ పూర్, కిషన్ గఢ్ లలో రూ. 5000-6300, జైపూర్‌లో రూ. 4500-6750, పప్పు రూ. 7800-8100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు