ఈ ఏడాది గుజరాత్లో యాసంగి పెసర పంట విస్తీర్ణం గతఏడాది మాదిరిగా ఉన్నప్పటికీ పంట దిగుబడి తగ్గింది. మరియు స్థానిక గిరాకీ వలన రాజకోట్లో దినసరి 150-200 బస్తాల రాబడిపై సాద రూ.6555-6900, చమ్కీరూ. 7025-7245 లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీ పెసలు చెన్నై డెలివరీ రూ. 100-700 ధరతో వ్యాపారమెంది.
తమిళనాడులోని తంజావూరు, చిదంబరం మయావరం, విల్లూపురం, పన్ రొట్టి, దిండివనం ప్రాంతాల మార్కెట్లలలో కలిసి దినసరి 1500-2000 బస్తాల కొత్త సరుకు రాబడి పై చెన్నై డెలివరీ రూ. 6900-6950, దిగుమతి అయిన పెడెశ్వర్ పప్పు క్వాలిటీ పెసలు రూ. 6950-7000 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు