పెసల దిగుమతులు పెరిగే అవకాశం



 అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ద్వారా డిమాండ్ రావడంతో పేడేశ్వర్ 900 డాలర్లు, పొకాకో 835 డాలర్లు మరియు అనిశేవా 20 డాలర్లు పెరిగి 775 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో చెన్నైలో పేడేశ్వర్ పెసలు రూ. 150 పెరిగి రూ.7200 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.


కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 2021-22 రబీ సీజన్ కోసం మద్దతు ధరతో 19,632 టన్నుల కొనుగోలుకు సమ్మతించింది. రాష్ట్రప్రభుత్వం ద్వారా నిర్ణయించిన తేదీ నుండి 90 రోజులలోపల కొనుగోలు చేయవలసి ఉంటుంది.


వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి రెండవ ముందస్తు అంచనా ప్రకారం 2021-22 లో దేశంలో ఖరీప్ సీజన్లో 20 లక్షల టన్నులు మరియు రబీలో 10.60 లక్షల టన్నులు కలిసి 30.60 లక్షల టన్నుల ఉత్పత్తికి అవకాశం కలదు.


వ్యాపారస్తుల అంచనా ప్రకారం గత నెలలో దిగుమతి విధానంలో సవరణ వలన ముందు చేసిన వ్యాపారం 31, మార్చి లోపు మ్యాన్మార్ లాంటి దేశాల నుండి 50 వేల టన్నులు దిగుమతి కావలసి ఉంది. అయితే, గత నెలలో కేంద్రం పెసల దిగుమతి విధానంలో మార్పుచేసి స్వేచ్ఛా దిగుమతి నుండి నియంత్రణ శ్రేణిలో కలపడం జరిగింది. అయితే, వ్యాపారుల వినతి మేరకు డిజిఎఫ్టి వారు 2021-22 కోసం పెసల దిగుమతికోసం దిగుమతిదారులకు 11, ఫిబ్రవరికంటే ముందు పెసల వ్యాపారం కోసం విదేశీ వ్యాపార విధానం ( ఎఫ్ఎపి) లో కొన్ని నిబంధనలను మినహాయించాలని నిర్ణయించారు. ఇందులో దిగుమతికోసం 11, ఫిబ్రవరి, 2022 కంటే ముందు చేసిన అడ్వాన్సు రూపంలో చెల్లింపు ఆధారంగా అనుమతి ఉండగలదు. గత ఏడాది 2020-21 ఆర్థిక సంవత్సరంలో 771.40 లక్షల డాలర్ల విలువ గల పెసలు దిగుమతి అయ్యాయి. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 లో సెప్టెంబర్ వరకు 769 లక్షల డాలర్లు విలువ గల సరుకు దిగుమతి అయింది.


గతవారం అంతర్జాతీయ మార్కెట్లో పెసల ధర రూ. 150 మరియు దేశీ పెసలు రూ. 50 ప్రతిక్వింటాలుకు పెరిగాయి. మహారాష్ట్ర ప్రాంతపు సాదా పెసలు చెన్నై డెలివరీ రూ. 7200, చమ్కీరూ. 7500, ఆంధ్రప్రాంతపు సన్న నాణ్యమైన చమ్కీపెసలు సేలం, త్రిచి, డిండిగల్, విరుధ్ నగర్ డెలివరీ రూ. 7100-7150 ధరతో వ్యాపారమయింది.


రాజస్తాన్లోని సుమేర్పూర్, కేల్డీ ప్రాంతాలలో రైతుల మీడియం సరుకు రూ. 6000-6400, నాణ్యమైన సరుకు రూ. 6800-7000, జైపూర్లో రూ. 6000-6700, పప్పు రూ. 7400-8200, మిటుకులు రూ. 6000-7100 ధరతో వ్యాపారమయింది.


మధ్య ప్రదేశ్లోని జబల్పూర్లో రూ.5000-7100, హరదాలో రూ. 4000-7000, పిపరియాలో 800-1000 బస్తాల రాబడిపై రూ. 6000-6900, అకోలాలో రూ.6500-7000, మోగర్ పెసలు రూ. 9200-9400 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు