పెసరపప్పుకు గిరాకీ

  

1, ఏప్రిల్ వరకు దేశంలో యాసంగి పెసర విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.11 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 5.54 లక్షల హెక్టార్లకు చేరింది. తమిళనాడులో కొత్త పెసర రాబడి ప్రారంభం అయింది. వచ్చే వారం నుండి రాబడులు పెరిగే అవకాశం కలదు. 


ప్రస్తుతం పెసరపప్పుకు డిమాండ్ ఉండడంతో పాటు అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 40 డాలర్లు పెరిగి 980 డాలర్లు, పొకాకొ 835 డాలర్లు, అన్నేశ్వర్ 800 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో చెన్నెలో పేడేశ్వర్ రూ. 7500, ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీ పెసలు రూ. 100 పెరిగి రూ. 7100 మరియు ఆంధ్రలో పప్పు మిల్లుల డిమాండ్తో సాదా పెసలు రూ. 7100, చమ్కీరూ. 7250 ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని సుమేర్పూర్, కేక్ట్, కిషన్ఢ్ ప్రాంతాలలో ఖరీఫ్ సీజన్ మీడియం సరుకు రూ.5000-6100, నాణ్యమైన సరుకు రూ. 6600–7100, జైపూర్లో రూ. 6000-7150, పప్పు రూ. 8500-9000, మిటుకులు రూ. 6000-7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని జబల్పూర్, పిపరియా, కరేళిలలో ప్రతిరోజు 3-4 వేల బస్తాల పెసల రాబడిపై రూ. 4000–7000, ఇండోర్లో రూ. 7100-7200, మహారాష్ట్రలోని అకోలాలో రూ.6500-7000, మొగర్ పెసలు రూ.9200-9400 ధరతో వ్యాపారం.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు