చెన్నైలో దిగుమతి అయిన పేడేశ్వర్ పెసలు రూ.7200, మహారాష్ట్రలో ఉద్గిర్లో సాదా పెసలు తమిళనాడు డెలివరి రూ. 7200-7250, ఆంధ్ర ప్రాంతపు సన్న పెసలు రూ. 7150-7200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ప్రస్తుత ఖరీఫ్, రబీ సీజన్ 2021-22 (జూలై-జూన్) లో దేశంలో పెసల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 30.90 ల.ట. నుండి తగ్గి 30.60 ల.ట.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ రెండవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. ప్రభుత్వం ఉత్పత్తి తగ్గగలదని అంచనా వ్యక్తం చేసినందున ఉత్పాదక కేంద్రాల వద్ద ఎడతెరిపిలేని సరఫరాతో పాటు వ్యాపారుల కొనుగోళ్లు వృద్ధి చెందినందున గత వారం పెసలు మరియు పప్పు ధర రూ. 100-200 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి.
అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 15 డాలర్లు పెరిగి 900 డాలర్లు, పొకాకొ 835 డాలర్లు, అన్నేశ్వర్ 755 డాలర్లు ప్రతిపాదించినందున రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి 12-15 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 6000-6700, మధ్య ప్రదేశ్లోని జబల్పూర్, హర్దాలో ప్రతి రోజు 700-800 బస్తాల సరుకు రాబడిపై రూ. 4000–7100, పిపరియాలో రూ. 6000-7000, తెలంగాణలోని ఖమ్మంలో పెసలు రూ. 6500, పప్పు సార్టెక్స్ రూ. 8900, నాన్-సార్టెక్స్ రూ. 8500, అకోలాలో పెసలు రూ. 6500-6900, మోగర్ పెసలు రూ.9200-9400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు