పెరిగిన యాసంగి పెసర విస్తీర్ణం

 


అంతర్జాతీయ విపణిలో అనేశ్వర్ 800 డాలర్లు, పేడేశ్వర్ పెసలు 840 డాలర్లు, పొకాకో 850 డాలర్లు ప్రతి టన్ను ధరతో వ్యాపా రమైంది. దేశంలో ఏప్రిల్ 18 వరకు యాసంగి పెసర విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6.73 ల.హె. నుండి 2 ల.హె. పెరిగి 8.62 ల.హె.లకు చేరింది. 


యాసంగి పెసర విస్తీర్ణం పెరగ డంతో గత వారం ఉత్పాదక కేంద్రాలలో రైతులు, స్టాకిస్టుల అమ్మకాలతో ధర రూ. 200-300 తగ్గింది.రాజస్తాన్లోని సుమేర్పూర్, కేక్, కిషన్ఢ్, గంగానగర్, జోధ్ పూర్ ప్రాంతాలలో దినసరి 4–5 వేల బస్తాల పెసల రాబడిపై రూ.6500-6800,జైపూర్లో పెసలు రూ. 6000 6950, పప్పు రూ. 8300-8700, మిటుకులు రూ. 6000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ రూ.5000-6800, హర్దాలో ప్రతి రోజు 1000-1200 బస్తాల రాబ డిపై రూ. 4000-6600, పిపరియా, కరేశిలలో ప్రతిరోజు 1500 బస్తాల పెసలు రాబడిపై రూ. 6400-6500, ఇండోర్లో రూ. 6600-6700, మహారాష్ట్రలోని అకోలాలో రూ.6500-6900, మొగర్ పెసలు రూ. 9200 -9400, జల్గాంవ్లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6400, మహారాష్ట్ర సరుకు రూ. 6600 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog