కర్ణాటక, మహరాష్ట్ర లలో కొత్త పెసలు

 

 ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రతిపాదించడంతో మార్కెట్లలో రైతుల సరుకు రాబడి తగ్గడంతో కర్ణాటక, మహారాష్ట్ర మొదలగు ఉత్పాదక కేంద్రాల వద్ద కొత్త సరుకు రాబడులు పెరగడం లేదు. కందుల ధరలు పెరగడం మరియు పెసర విస్తీర్ణం తగ్గడంతో భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనితో స్టాకిస్టుల అమ్మకాలు తగ్గడంతో ధర రూ. 100-200 పెరిగింది.


వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి తాజా నివేదిక ప్రకారం దేశంలో 16 సెప్టెంబర్ నాటికి పెసర పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 34.64 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 33.26 లక్షల హెక్టార్లకు చేరింది. ఉత్పత్తి తగ్గడంతో స్టాకిస్టుల కొనుగోళ్ల వలన రూ.6500-7250 ధరతో వ్యాపారమెంది.

కర్ణాటకలోని బాగల్ కోట్ లో 3 వేల బస్తాలు, గదగ్ లో 3-4 వేల బస్తాలు, కల్బుర్గిలో 3 వేలు, యాద్ లో 2500, లక్ష్మేశ్వర్ లో 1500, హుబ్లీలో 700-800 బస్తాలు, బీదర్ లో 800-1000,రాయిచూర్, బస్వక ల్యాణ్ ప్రాంతాలలో 3-4 వేల బస్తాల కొత్త -సరుకు రాబడిపె రూ. 6000-7500, నాణ్యమైన సరుకు రూ. 7800 ధరతో వ్యాపారమెంది.

 మహారాష్ట్రలోని అహ్మద్ న గర్ లో 1500 బస్తాల కొత్త సరుకు రాబ డిపె రూ. 6000-8000, ఖామ్ గాంలో 500-600 బస్తాల రాబడి పె రూ. 5500-7300, దుధ్ నిలో రూ. 6000-7350, దరియా పూర్ లో రూ.6000-7200, జలాం లో రూ. 6500-7850 ధరతో వ్యాపారమెంది.

ఆంధ్రప్రదేశ్ లోని పొన్నూరులో పెసలు పాలిష్ సరుకు రూ. 7000, అన్-పాలిష్ రూ. 6850, 

మధ్య ప్రదేశ్ లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతి రోజు 6-7 వేల బస్తాల పెసల రాబడిపై రూ. 5000-6800, ఇండోలో రూ. 6600-6800, మరియు కర్ణాటక లోని గుల్బర్గా పెసర పప్పు బెంగుళూరు డెలివరి రూ. 8700-8800, రాజస్తాన్ పెసలు రూ. 8300-8600 మరియు రాజస్తాన్ లోని కేడి 4-5 వేల బస్తాలు, కిషన్ గఢ్ లో 4 వేల బస్తాలు, ఇతర మార్కెట్లలో 3-4 వేల బస్తాల పెసల రాబడి పె రూ. 5500-6500, జై పూర్ లో రూ. 4500-6850 మరియు గుజరాత్ లోని రాజ్ కోటలో రూ. 6000-7300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు