అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 40 డాలర్లు తగ్గి 940 డాలర్లు ప్రతి టన్ను ధర ప్రస్తావించబడింది. అయితే పొకాకో 20 డాలర్లు వృద్ధిచెంది 855 డాలర్లు మరియు అనేశ్వర్ 800 డాలర్లు క్రితం మాదిరిగానే ప్రస్తావించగా, తమిళనాడు ప్రాంతపు కొత్త పెసలు చెన్నై డెలివరి రూ.50 తగ్గి రూ. 6900-6950, చెన్నెలో పేడేశ్వర్ రూ. 7400, ఆంధ్ర ప్రాంతపు నాణ్యమైన సన్నరకం చమ్కీ పెసలు రూ. 7100 మరియు ఆంధ్రలో పప్పు మిల్లుల డిమాండ్తో సాదా పెసలు రూ. 7050, చమ్కీ రూ. 7200 ధరతో వ్యాపారమెంది. ప్రస్తుతం భారతీయ పప్పుమిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు.
ఇందుకు ముఖ్య కారణమేమనగా, ఇంతవరకు మధ్య ప్రదేశ్, రాజస్థాన్ల నుండి సరఫరా కొనసాగుతున్నది. మే నెల నుండి బిహార్, మే నెల చివరి వారానికి గుజరాత్, మధ్య ప్రదేశ్లో మరియు జూన్ నుండి ఉత్తరప్రదేశ్, జులై నుండి కర్ణాటకలో కొత్త పెసల రాబడులు ప్రారంభం కానున్నాయి. తద్వారా ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ఖరీఫ్ సీజన్ సరుకు సప్లై ఉండగలదు. ప్రస్తుతం కందులు, శనగలు, బఠాణీలు లాంటి అపరాల ధరలు బలోపేతం చెందేందుకు అడ్డుకట్ట పడుతున్నది.
రాజస్తాన్లోని సుమేరప్పూర్, కేక్, కిషన్ఢ్,గంగానగర్, జోధ్పూర్ ప్రాంతాలలో ఖరీఫ్ సీజన్ మీడియం సరుకు రూ. 5000-6000, నాణ్యమైన సరుకు రూ.6500-7100, జైపూర్లో పెసలు రూ. 6000-7100, పప్పు రూ. 8500-8900, మిటుకులు రూ. 6000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని జబల్పూర్, పిపరియా, కరేళిలలో ప్రతిరోజు 4-5 వేల బస్తాల పెసల రాబడిపై రూ. 4000-6950, ఇండోర్ రూ.7000-7200, మహారాష్ట్రలోని అకోలాలో రూ.6500-7000, మొగర్ పెసలు రూ. 9200-9400 ధరతో వ్యాపారమైంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం మధ్య ప్రదేశ్లోని పిపరియాలో ప్రభుత్వం తరపున 11 ఏప్రిల్ నుండి పెసర అమ్మకాల కోసం టెండర్ జారీ చేసే అవకాశం ఉంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు