పెసలు



 రాజస్థాన్ లోని పెసల ఉత్పాదక కేంద్రాల వద్ద ముమ్మరంగా పంట కోతలు కొనసాగుతున్నాయి. దీనితో గత వారం రోజులుగా ప్రతి రోజు 30-32 వేల బస్తాల కొత్త పెసలు రాబడి కాగా,జాతీయ స్థాయిలో విస్తీర్ణం తగ్గడంతో పాటు అనేక ఉత్పాదక కేంద్రాలలో వర్షాల వలన పంటకు నష్టం చేకూరింది. అంతేకా కుండా అక్టోబర్ 17 నుండి ఛత్తీస్ ఘడ్ లో ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కాను న్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ ఏజెన్సీల కొనుగోళ్లకు అవకాశం ఉండ డంతో పాటు కందుల ధరలు పటిష్టంగా మారడంతో పెసర పప్పుకు డిమాండ్ పెరుగుతోంది. స్టాకిస్టుల కొనుగోళ్లతో కూడా ధరలు బలోపేతం చెందుతు న్నాయి.వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి తాజా నివేదిక ప్రకారం దేశంలో 23 సెప్టెంబర్ నాటికి పెసర పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 34.71 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 33.37 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్ లో విస్తీర్ణం 98,643 హెక్టార్ల నుండి తగ్గి 79,863 హెక్టార్లకు, మిటుకుల విస్తీర్ణం 13,094 నుండి పెరిగి 14,262 హెక్టార్లకు చేరింది.


 రాజస్థాన్ లో ఆగస్టు 24 వరకు మిటుకుల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9,04,300 హెక్టార్ల నుండి పెరిగి 9,50,000 హెక్టార్లకు చేరింది. పంట కోతలు ప్రారంభమయ్యా యి. పెసర పప్పుతో పోలిస్తే మిటుకుల పప్పు ధరలు తక్కువగా ఉండడంతో మహారాష్ట్ర, మరియు దక్షిణాది రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉండగలదు. స్టాకిస్టులు కూడా చురుకుగా మారే అవకాశం ఉంది. కర్ణాటకలోని బాగల్‌కోట్, గదగ్,లక్ష్మేశ్వర్, హుబ్లీ ప్రాంతా లలో 20-25 వేల బస్తాలు, కల్బురి, యాద్ర్, బీదర్,రాయిచూర్, బస్వకల్యాణ్, బాల్కి ప్రాంతాలలో 8-10 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 6200-7500, నాణ్యమైన సరుకు రూ. 7800 ధరతో వ్యాపారమెంది.

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో 1000-1200 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 6000-8000, ఖామ్ గాంవ్ లో రూ. 6500-7450, దుధ్ నిలో 1500 బస్తాల రాబడిపై రూ. 5000-7450, అకల్ కోట్ లో 400-500 బస్తాలు రాబడి కాగా, రూ. 6000-7400, ఉద్లో రూ. 7680, జలాం లో చమ్కీ పెసలు రూ. 7600-8000, సాదా రూ. 6500-7000,జాల్నా లో 400-500 బస్తాల రాబడిపై రూ. 6500-7500 ధరతో వ్యాపారమెంది.

ఆంధ్రప్రదేశ్ లోని పొన్నూరులో నాణ్యమెన పెసలు పాలిష్ సరుకు రూ. 7250, అన్-పాలిష్ రూ. 7100, మధ్య ప్రదేశ్ లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతి రోజు 3-4 వేల బస్తాల పెసల రాబడి పై రూ. 6200-6900, ఇండోర్ లో రూ. 6200-7000, మరియు

 కర్ణాటకలోని గుల్బర్గా పెసరపప్పు బెంగుళూరు డెలివరి రూ. 8700-8800, రాజస్తాన్ పెసలు రూ. 8400-8600 మరియు 

రాజస్తాన్లోని మేడతాలో 9-10వేల బస్తాలు, కిషన్ గఢ్ లో 3-4 వేల బస్తాలు, కేడిలో 6-8 వేల బస్తాలు, రామ్ గంజ్ మండిలో 3-4 వేల బస్తాలు, సుమేర పూర్లో 3 వేల బస్తాలు, ఇతర మార్కె ట్లలో 8-10 వేల బస్తాల పెసల రాబడిపై రూ. 5500 - 6000, నాణ్యమైన సరుకు రూ. 6800-7200, జైపూర్ లో రూ. 5500-7100, పప్పు రూ. 8000-8400, మరియు గుజరాత్ లోని రాజ్ కోటలో రూ. 6000-6900 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog