పెసరపప్పు యధాతథం

 


 కొనుగోలుదారులు కరవైనందున గత వారం అపరాల ధరల ప్రభావం పెసలపై పొడసూపింది. తద్వారా పెసల ధర ప్రతి క్వింటాలుకు రూ. 50 పతనమైంది. ఆంధ్ర ప్రాంతం మిల్లు రకం పెసలు చెన్నై డెలివరి రూ. 7850, పాలిష్ సరుకు రూ. 8200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


దేశంలో ఏప్రిల్ 21 నాటికి యాసంగి అపరాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 8.36 ల.హె. నుండి పెరిగి 11.56 ల.హె.కు విస్తరించింది. ఇందులో గుజరాత్లో ఏప్రిల్ 17 నాటికి 69,801 హెక్టార్ల నుండి తగ్గి 46,435 హెక్టార్లకు పరిమితమైంది.

మహారాష్ట్రలోని లాతూర్లో కొత్త పెసలు రూ.6500-7700, అహ్మద్ నగర్లో రూ. 7800-9700, అకోలాలో రూ. 7400-7800, మోగర్ రూ. 11,500-11,600, జల్గాంవ్లో రూ. 7500-9200 మరియు ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా, గుంటూరు, పొన్నూరు ప్రాంతపు పాలిష్ పెసలు నాణ్యమైన సరుకు రూ. 7750, అన్-పాలిష్ రూ. 7600, విజయవాడలో పప్పు నాణ్యమైన సరుకు రూ. 10,600, మీడియం రూ. 10,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్లో ప్రతి రోజు 250-300 బస్తాల పెసల రాబడిపై రూ. 7800-8500, ఇండోర్లో రూ. 7500-7800 మరియు రాజస్తాన్లోని కిషస్గఢ్, కేక్, సుమేర్పూర్, బికనీర్, నోఖా మార్కెట్లలో పెసలు అన్-పాలిష్ రూ. 7000-7900, జైపూర్లో రూ. 8000 - 8700, పప్పు రూ. 9300-10,000, మిటుకులు రూ.6100-6400 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో రబీ సీజన్ కొత్త పెసలు రూ. 7500-8200, దాహోద్లో రూ. 6400-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog