పెరిగిన వేసవి పెసర సేద్యం
అంతర్జాతీయ మార్కెట్లో పేడేశ్వర్ 1170, పొకాకో 830 డాలర్లు ప్రతి టన్ను ధరతో వ్యాపారమైంది. దేశంలలో ఏప్రిల్ 28 నాటికి యాసంగి పెసర సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 12.84 ల.హె. నుండి పెరిగి 14.27 ల.హె.కు విస్తరించింది.
మధ్య ప్రదేశ్లోని ఖండ్వా, ఖరోన్, హోశంగాబాద్, హర్దా ప్రాంతాలలో ప్రతిరోజు 500-600 బస్తాల వేసవి పెసల రాబడి కాగా, రూ. 7500-7900 ధరతో వ్యాపారమైంది. రాబోవు రోజులలో రాబడులు పెరిగే అవకాశం ఉన్నందున ఆంధ్ర ప్రాంతపు మిల్లు రకం సరుకు చెన్నె డెలివరి రూ. 400 తగ్గి రూ. 7450, చమ్కీరూ. 8000-8050 ధరతో వ్యాపారమెంది. మహారాష్ట్రలోని లాతూర్లో కొత్త పెసలు రూ. 7000-7700, అహ్మద్ నగర్ లో రూ. 7800-9500,
అకోలాలో రూ. 7600-7900, మోగర్ రూ. 11,500-11,600, జల్గాంవ్లో రూ. 8500-9550 మరియు ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా, గుంటూరు, పొన్నూరు ప్రాంతపు పాలిష్ పెసలు నాణ్యమైన సరుకు రూ. 7800, అన్-పాలిష్ రూ. 7650, విజయవాడలో పప్పు నాణ్యమైన సరుకు రూ. 10,600, మీడియం రూ. 10,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మధ్య ప్రదేశ్లోని జబల్ పూర్ లో ప్రతి రోజు 250-300 బస్తాల పెసలు రాబడిపై రూ. 7800-8500, ఇండోర్లో రూ. 7300-7500 మరియు రాజస్తాన్లోని కిషన్ గఢ్, కేక్, సుమేర్ూర్, బికనీర్, నోఖా మార్కెట్లలో పెసలు అన్-పాలిష్ రూ. 6000-7500, జైపూర్లో రూ.7800-8600, పప్పు రూ. 9300 -10,000, మిటుకులు రూ.6800-7400 మరియు గుజరాత్లోని
రాజ్కోట్లో రబీ సీజన్ కొత్త పెసలు 500-600 బస్తాల రాబడిపై రూ. 7500-8200, దాహోద్లో రూ. 6200-8500 ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు