పెసరపప్పుకు డిమాండ్ పెరిగే అవకాశం

 



 వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వారపు నివేదిక ప్రకారం ప్రస్తుత ఖరీప్ దేశంలో 29, జూలై వరకు పెసర పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 25 లక్షల 29 వేల హెక్టార్ల నుండి పెరిగి 29 లక్షల 26 వేల హెక్టార్లకు చేరింది. 25, జూలై వరకు రాజస్తాన్లో పెసర విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11, 45,520 హెక్టార్ల నుండి పెరిగి 18,55,650 హెక్టార్లకు, మిటుకులు 2,06,770 హెక్టార్ల నుండి రికార్డు స్థాయికి 7,99,050 హెక్టార్లకు, గుజరాత్లో 53,115 హెక్టార్ల నుండి తగ్గి 44,169, మిటుకులు 7768 హెక్టార్ల నుండి తగ్గి 7124, తెలంగాణాలో 27, జూలై వరకు పెసర విస్తీర్ణం 1,27,739 ఎకరాల నుండి తగ్గి 55,675 ఎకరాలకు చేరడంతో పాటు పంట విత్తడం పూర్తయింది. 


మహారాష్ట్ర, కర్నాటకలలో విస్తీర్ణం తగ్గడంతో పాటు పంటకు నష్టం వాటిల్లింది. లభించిన సమాచారం ప్రకారం కందిపప్పు ధరలు పెరగడంతో పెసరపప్పు ధరలు కూడా పెరగడానికి అవకాశముంది. దీనితో జబల్పూర్ ప్రాంతపు గ్రావిటీ క్లీన్ చెన్నె డెలివరీ రూ.7750, నరసారావుపేట, పొన్నూరు ప్రాంతాల నాణ్యమైన చమ్కీ పెసలు రూ.200 పెరిగి రూ. 7200, సాదా రూ. 7000 మరియు మధ్య ప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 10-12 వేల బస్తాల యాసంగి పెసల రాబడిపై రూ.5000-6500, కర్నాటక ప్రాంతపు పెసరపప్పు బెంగుళూరు డెలివరీ రూ. 8800-9000, రాజస్తాన్ ప్రాంతపు సరుకు రూ. 8200-8500 మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ ప్రాంతంలో కొత్త పెసలు రూ. 5800-6200, అకోలాలో రూ. 6500-7000 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు