బలపడుతున్న శనగల ధరలు

 


సీజన్లో దేశంలో శనగల ఉత్పత్తి 137.50 ల.ట.కు చేరినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. అయితే, దేశంలోని పలు ప్రాంతాలలో అతివృష్టి మరియు కొన్ని ప్రాంతాలలో లోటు వర్షపాతం తగ్గిన ఉత్పత్తి మరియు పెరుగుతున్న వినియోగంతో పాటు తూర్పు ఆస్ట్రేలియాలోని ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. భారతదేశం శనగల ఉత్పత్తిలో ప్రసిద్ధి గాంచినట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం పంట ప్రాథమిక దశలో ఉంది. మున్ముందు పరిస్థితి సానుకూలంగా మారే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. పెరుగుతున్న లానినొ మరియు భారత ధృవాలలో నకారాత్మక శక్తి పెంపొందడం వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున దక్షిణ ఆస్ట్రేలియాలోని విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, క్రిస్ ల్యాండ్ మరియు తూర్పు ప్రాంతాలలో మున్ముందు శనగ పంటకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని దేశీయ మార్కెట్లో దిగజారుతున్న శనగల ధరలకు కళ్లెం పడింది.


గత వారం ఢిల్లీ లారెన్స్ రోడ్లో 80-85 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ శనగలు రూ. 4980-5000, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4925 మరియు ముంబైలో టాంజానియా శనగలు రూ. 4500, సూడాన్ కాబూలి శనగలు రూ. 5850-5950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జెజె శనగలు రూ. 5050, ఒంగోలులో రూ.4900 మరియు కాక్-2 కాబూలి కొత్త శనగలు రూ. 7000, పాత సరుకు రూ. 7400, డాలర్ శనగలు రూ. 10,000, కర్ణాటక ప్రాంతపు శనగలు ఈరోడ్ డెలివరి రూ. 547

ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జెజె శనగలు రూ. 5075, ఒంగోలులో రూ. 4900 మరియు కాక్-2 కాబూలి కొత్త శనగలు రూ. 7000, పాత సరుకు రూ. 7400, డాలర్ శనగలు రూ. 10,000, కర్ణాటక ప్రాంతపు శనగలు ఈరోడ్ డెలివరి రూ. 5575-5525, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతం సరుకు రూ. 5450 - 5475, మహారాష్ట్ర ప్రాంతం సరుకు రూ. 5325, 

ముంబైలో టాంజానియా శనగలు మదురై డెలివరి రూ. 5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో 2-3 వాహనాల శనగల రాబడిపై రూ.4500-5500, అమరావతిలో రూ. 4500-4750, లాతూర్లో రూ. 5000–5200, అకోలాలో రూ. 5000, లాతూర్ ప్రాంతం పప్పు బెంగుళూరు డెలివరి రూ. 6050, అకోలా ప్రాంతపు సార్టెక్స్ రూ. 5850, నాన్-సార్టెక్స్ రూ. 5750, 

మధ్య ప్రదేశ్లోని పిపరియా, అశోక్ నగర్, బసోదా, నీమచ్, హర్దా ప్రాంతాలలో 5-6 బస్తాల సరుకు రాబడిపై రూ. 4000-4750, ఇండోర్లో రూ. 5025-5050, డాలర్ శనగలు రూ. 10,000-10,500, కాబూలి శనగలు 40-42 కౌంట్ రూ. 11,600, 42-44 కౌంట్ రూ. 11,400, 44-46 కౌంట్ రూ. 11,200 ధరతో వ్యాపారమైంది.


ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో 400-500 బస్తాలు సరుకు రాబడిపై రూ. 4400-4500, ఉరైలో రూ. 4600-4650, రాజస్తాన్ లోని కేక్ , బికనీర్, జోధ్ పూర్, కిషన్ గఢ్, సుమేర్పూర్, కోటా ప్రాంతాలలో 800-1000 బస్తాలు రూ. 4200-4570 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.




సిరిశనగ


 మధ్య ప్రదేశ్లోని బసోదాలో సిరిశనగ రూ. 6200-6400, కరేలి, దేవాస్, అశోక్ నగర్, నీమచ్ ప్రాంతాలలో ప్రతి రోజు 1000-1200 బస్తాలు రాబడి పై రూ. 6300-6400, ఇండోర్లో రూ.6550-6600, ఉత్తర ప్రదేశ్లోని మహోబాలో రూ. 6000-6100, లలిత్పూర్లో 1000 బస్తాలు రూ. 6350-7000, చందౌసి, బిలాసి, బహజోయి, వజీర్ గంజ్ ప్రాంతాలలో రూ. 6700-6800, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ మరియు మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6900, బరేలిలో చిన్న సరుకు రూ. 6925-6950, బోల్డు సరుకు రూ.7650-7700 ప్రతి


క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ముంబైలో కెనడా నుండి దిగుమతి అయిన సిరిశనగ కంటైనర్ రూ. 6600, ఆస్ట్రేలియా సరుకు రూ. 6700, ముంద్రా ఓడ రేవు వద్ద రూ. 6725, కోల్కతాలో కెనడా సిరిశనగ రూ. 350, ఆస్ట్రేలియా సరుకు రూ. 6350-6475, దిల్లీలో కెనడా సరుకు రూ.6550 మరియు మధ్యప్రదేశ్ సరుకు రూ. 6900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog