దేశంలో సమృద్ధిగా శనగ నిల్వలు - గత వారం మార్కెట్ ధరలు
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
12-10-2021
దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో భారీగా శనగల నిల్వలు ఉన్నాయి. దీపావళి పండుగ డిమాండ్ కోసం కేవలం ఒకనెల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం అనుకూల వర్షాల నేపథ్యంలో విస్తీర్ణం మరియు దిగుబడి పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు నిరాశకు గురవుతున్నారు. ఎందుకనగా భవిష్యత్తులో ధరల పెరుగుదలకు అవకాశం కనిపించడం లేదు.
లభించిన సమాచారం ప్రకారం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్ లోని స్టాకిస్టులు సరుకు అమ్మకం కోసం ముందుకు వస్తున్నారు. దీనితో ధరలు స్థిరంగా మారాయి. గత వారం ఎన్సిడిఇఎక్స్ వద్ద సోమవారం శనగల అక్టోబర్ వాయిదా రూ. 5050తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ.30 తగ్గి రూ. 5020 వద్ద ముగిసింది.
సెబీ వారు వచ్చే నెల కోసం వాయిదా వ్యాపారానికి అనుమతించకపోవడంతో వ్యాపారులు 20 అక్టోబర్న వాయిదా సమాప్తమైన తరువాత సెబీ వారి ఆదేశం అనంతరం తిరిగి వాయిదా వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. దీనితో మార్కెట్లో పాటు వాయిదా ధరలపై కూడా ప్రభావం పొడసూపుతుంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు