నువ్వుల ధరలపై భారీ ఆశలు వద్దు

 

Sesame, sesame market,, నువ్వులు

 ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 2 నాటికి దేశంలో నువ్వుల సేద్యం 12.77 ల.హె. నుండి స్వల్పంగా పెరిగి 12.83 హెక్టార్లు, రామతిలలు 39 వేల హెక్టార్ల నుండి 85 వేల హెక్టార్లకు విస్తరించింది. తెలంగాణలో గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 421 ఎకరాల నుండి తగ్గి 406 ఎకరాలు, గుజరాత్ లో ఆగస్టు 29 నాటికి 99,832 హెక్టార్ల నుండి 71,583 హెక్టార్లకు పరిమితం కాగా మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో గత ఏడాదితో పోలిస్తే సంతృప్తికరంగా విస్తరించగలదని భావిస్తున్నారు.


రాబోయే సీజన్ లో నువ్వుల స్టాకిస్టులకు కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తున్నది. తద్వారా కొత్త సీజన్లో ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి ఎగబాకే అవకాశాలు మృగ్యమే అని భావించవచ్చు.

కర్ణాటకలోని కుస్తగిలో 1-2 వేల బస్తాల నువ్వుల రాబడిపై రూ. 11,200-11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

గుజరాత్ లో గత వారం 10-15 వేల బస్తాల నువ్వుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 12,100-12,300, మీడియం రూ. 11,800-12,000, యావరేజ్ రూ. 11,700-11,800 మరియు 3 వేల బస్తాల నల్లనువ్వులు జడ్-బ్లాక్ రూ. 12,875-13,800, మీడియం రూ. 11, 750-12,250, క్రషింగ్ సరుకు రూ. 8500-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో హళ్లింగ్ నువ్వులు రూ. 11,000-12,100, కాన్పూర్ లో హళ్లింగ్ సరుకు రూ. 12,300-12,500, ముంబైలో తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు సార్టెక్స్ రూ. 13,100, ముంద్రా డెలివరి రూ. 12,900, గ్వాలియర్ లో హళ్లింగ్ సరుకు బెస్ట్ రూ. 12,100-12,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్ లోని నిమచ్ లో గత వారం 1000-1200 బస్తాల రాబడిపె తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు రూ. 12,300-12,600,మీడియం రూ. 11,800-12,200, యావరేజ్ సరుకు రూ. 11,200-11,400, జాప్రాలో 500 బస్తాలు రూ. 11,400-11, 700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని నువ్వుల ఉత్పాదక కేంద్రాలలో గత వారం 600-800 బస్తాల సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లలో తెల్లనువ్వులు రూ. 9000-13,600, నల్లనువ్వులు రూ. 8990-11,450, పశ్చిమబెంగాల్ లోని బెల్లా, ఖరగ్ పూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 4-5 వాహనాల సరుకు అమ్మకంపై నల్లనువ్వులు రూ. 9000-9700, అన్-క్లిన్ సరుకు రూ. 8400-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఈరోడ్ కోసం రవాణా అవుతున్నది.

 తెలంగాణలోని నిజామాబాద్, మెట్‌పల్లి ప్రాంతాలలో గత వారం 2-3 వేల బస్తాల నువ్వుల రాబడిపై రూ. 11,500-12,000 ధరతో వ్యాపా రమె మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. 

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో గత వారం 2-3 వాహనాల సరుకు రాబడిపై రూ. 9200-9300 ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, సామర్లకోట ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది. కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో ఎర్రనువ్వులు రూ. 10,300-10,400, నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతా లలో రూ. 8500-9500 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ మరియు 75 కిలోల బస్తా విరుధ్ నగర్ డెలివరి రూ. 8000 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం