వర్షాల వలన ఎండాకాలం నువ్వు పంట ప్రభావితం
ఈ ఏడాది 29, ఏప్రిల్ వరకు దేశంలో ఎండాకాలం నువ్వు పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.20 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 4.36లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్లో 24, ఏప్రిల్ వరకు విస్తీర్ణం 1,07,784 హెక్టార్ల నుండి పెరిగి 1,23,548 హెక్టార్లకు చేరింది. తెలంగాణా సహా కొన్ని రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడి ప్రారంభమయింది.
అయితే, వర్షాల కారణంగా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాలలో పంటపై ప్రతికూల ప్రభావం పడడంతో నాణ్యత మరియు దిగుబడి తగ్గే అవకాశం కలదు. గతవారం నిజామాబాద్లో 100-150 బస్తాల కొత్త నువ్వుల రాబడిపై రూ. 13000–15400 ధరతో వ్యాపారమయింది.
గతవారం గుజరాత్లోని రాజ్కోట్లో 1500-2000 బస్తాల తెలుపు మరియు నల్ల నువ్వుల రాబడిపై తెలుపు రకం రూ. 14600-14750, మీడియం రూ. 14000–14250, యావరేజ్ రూ. 13700–13900, జెడ్ బ్లాక్ నలుపు రకం రూ. 13750-14000, మీడియం రూ. 12750-13250, క్రషింగ్ సరుకు రూ. 10500 11500 ధరతో వ్యాపారమయింది.
తమిళనాడులోని శివగిరిలో 1500-2000 బస్తాలకొత్త నువ్వుల రాబడిపై నలుపు రకం రూ. 14200-15800, ఎరుపు రూ. 14300-16000, తెలుపు రూ. 13900–16800, త్రిచంగోడ్లో 3 వేల బస్తాల రాబడిపై తెలుపు రూ.15130-16430, నలుపు రూ. 14530-15850, ఎరుపు రూ. 14520-15830 మరియు తిరుకోవిలూరు, దిండివనం, విరుధాచలం ప్రాంతాలలో దినసరి 2-3 వేల బస్తాల రాబడిపై రూ. 10000-12250 ప్రతి 80 కిలోల ధరతో వ్యాపారమయింది.
విజయనగరం ప్రాంతంలో 100-150 బస్తాల కొత్త ఎర్ర నువ్వుల రాబడిపై రూ. 12200–12500 ప్రతి క్వింటాలు మరియు నరసారావుపేట, సత్తెనపల్లి, ఒంగోలు తదితర ప్రాంతాలలో వారంలో 4-5 లారీల కొత్త సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 12500 ప్రతిక్వింటాలు మరియు విరూధనగర్, ఈరోడ్, కాంగేయం డెలివరీ ప్రతి 75 కిలోల బస్తా రూ. 9600 ( జిఎస్టి సహా) ధరతో వ్యాపారమయింది. చాగలమర్రి, దువ్వూరు, కడప, మెదుకూరు ప్రాంతాలలో వారంలో 8–10 లారీల రాబడిపై తెలుపు రూ. 14500, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 13000 ప్రతి క్వింటాలు మరియు విరూధ్ నగర్ డెలివరీ ప్రతి 75 కిలోల బస్తా రూ. 9600 ( జిఎస్టి సహా) ధరతో వ్యాపారమయింది.
పశ్చిమబెంగాల్ లోని బెల్గా, ఖడగపూర్ ప్రాంతాల నుండి ఎర్ర నువ్వులు అక్లీన్ రూ. 10400, క్లీన్ రూ.. 12000–12400 ధరతో వ్యాపారమయింది. మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో 98.2 రకం రూ. 14500-14600, హల్లింగ్ సరుకు రూ. 14300–14400 మరియు ఆగ్రాలో హల్లింగ్ రూ.14000, కాన్పూర్ 98.2 రకం రూ. 14400-14500, హల్లింగ్ రూ. 14200–14300 ధరతో వ్యాపారమయింది.

Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు