నువ్వులు - తగ్గిన గిరాకీ

 

15-02-2022

దేశంలోని వినియోగానికి అనుగుణంగా సరఫరా ఉండడం మరియు స్టాకిస్టుల అమ్మకాలతో ధరలు పెరగడంలేదు. ఈ ఏడాది ధరలు పెరిగే అవకాశం కనిపించడంలేదు. దీనితో రాజస్తాన్లో బికనీర్, కోటా, నోఖా, పాలీ, శ్రీగంగానగర్ తదితర ప్రాంతాలలో దినసరి తెల్ల నువ్వులు 5-7 వేల బస్తాల రాబడిపై గజ్జర్ రూ. 80-100 తగ్గాయి మరియు కొత్త తెల్ల నువ్వులు 99.1 రకం రూ. 10500-10600, 98.2 రకం రూ. 10200-10300, 95.5 రకం రూ. 9500-9600, గజ్జర్ రూ. 9000-9100 ధరతో వ్యాపారమయింది. 





మధ్యప్రదేశ్లోని డబ్రా, దతియా, గ్వాలియర్ ప్రాంతాల హల్లింగ్ రకం రూ. 10500-10600, కాన్పూర్ మరియు ఆగ్రాలలో హల్లింగ్ రూ. 10000-10100, 99.1 గుజరాత్ రకం రూ. 10600-10800, సార్టెక్స్ రూ. 11700-11800, ముంద్రా డెలివరీ రూ. 11600 ధరతో వ్యాపారమయింది.

 గుజరాత్లోని రాజ్కోట్, జూనాఘడ్, అమ్రేలీ తదితర ప్రాంతాలలో వారంలో 2-3 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెలుపు రూ. 10625-10750, మీడియం రూ.10375-11500, యావరేజ్ రూ. 10250-10350 మరియు 1000-1500 బస్తాల నల్ల నువ్వుల రాబడిపై జెడ్ బ్లాక్ రూ. 11500-12800, మీడియం రూ. 9500-11250, క్రషింగ్ రూ. 6500-8000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారయింది. 

మధ్య ప్రదేశ్లోని నిమచ్లో గతవారం 400-500 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ.9300-9550, మీడియం రూ. 8800-9100, యావరేజ్ రూ. 8300-8600 ధరతో వ్యాపారమయింది.

 కర్నాటకలోని ముదగల్, అరిసెకేరి, కలుబరిగి, చిత్రదుర్గ, మైసూరు ప్రాంతాలలో ( 75కిలోల బస్తా) నాణ్యమైన సరుకు తమిళనాడు డెలివరీ రూ. 7200-8450 ధరతో వ్యాపారమయింది. 

సత్తెనపల్లి, నరసారావుపేట, కడప, రాజంపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ. 9500-9600, హల్లింగ్ రకం తమిళనాడు డెలివరీ రూ. 9750-9820 ప్రతి క్వింటాలు మరియు పశ్చిమబెంగాల్ లోని బెల్టా ప్రాంతంలో ( 100 కిలోలు జిఎస్టి సహా) మైక్రో క్లీన్ ఈరోడ్ డెలివరీ రూ. 8600-9300, అక్లీన్ రూ. 7300–7400, ఒంగోలు సరుకు ప్రతి 75 కిలోల బస్తా 33 శాతం నూనె మరియు 1 శాతం ఎఫ్ ఎఫ్ కండిషన్ సరుకు రూ. 8100-8200 ( జిఎస్టి సహా) ధరతో వ్యాపారమై తమిళనాడుకోసం రవాణ అయింది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం