ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సెప్టెంబర్ 16 నాటికి దేశంలో నువ్వుల సేద్యం 13.07 ల.హె. నుండి స్వల్పంగా పెరిగి 13.12 హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్ లో 1 లక్ష హెక్టార్ల నుండి తగ్గి 72 వేల హెక్టార్లకు చేరింది. అయితే మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో విస్తీర్ణం పెరిగినందున లోటు పూరించబడగలదు. గడ్డి నువ్వుల విస్తీర్ణం 86 వేల హెక్టార్ల నుండి పెరిగి 98 వేల హెక్టార్లకు చేరింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లాంటి నువ్వుల ఉత్పాదక కేంద్రాలలో వర్షాల వలన పంటకు నష్టం చేకూరడంతో పాటు సరుకు నాణ్యత తగ్గే అవకాశం కలదు.
గుజరాత్ లో గత వారం నువ్వుల ఉత్పాదక కేంద్రాల వద్ద నాణ్యమైన సరుకు రూ. 11,900-12, 100, మీడియం రూ. 11,750-11,850, యావరేజ్ రూ. 11,500-11,600 మరియు 2-3 వేల బస్తాల నల్లనువ్వులు జడ్-బ్లాక్ రూ. 12,625-13,350, మీడియం రూ. 11,750–12,250, క్రషింగ్ సరుకు రూ. 8500-9250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఉత్తరప్రదేశ్ లోని ఆలో హళ్లింగ్ నువ్వులు రూ. 12,000-12,200, కాన్పూర్‌లో హళ్లింగ్ సరుకు రూ. 12,200-12,400, ముంబైలో తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు సార్టెక్స్ రూ. 12,900, ముంద్రా డెలివరి రూ. 12,700, గ్వాలియర్ లో తెల్ల నువ్వులు 99.1 రకం రూ. 12,500, హళ్లింగ్ సరుకు రూ. 12,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మధ్య ప్రదేశ్ లోని నిమచ్ లో తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు రూ. 11,800-11,900, మీడియం రూ.11,400-11,500, యావరేజ్ సరుకు రూ. 11,000-11,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
తెలంగాణలోని నిజామాబాద్, మెట్ పల్లిప్రాంతాలలో రూ. 11,300-11,800 ధరతో వ్యాపారమె మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది.
తమిళనాడులోని నువ్వుల ఉత్పాదక కేంద్రాల వద్ద గత వారం 400-500 బస్తాల సరుకు రాబడిపై స్థానిక మార్కెట్లలో ఎర్రనువ్వులు రూ. 9000-12,300, నల్లనువ్వులు రూ. 10,600-11,000 మరియు కర్ణాటకలోని కుష్టగి తదితర ప్రాంతాలలో సంత రోజు 800-1000 బస్తాల కొత్త నువ్వుల రాబడిపె రూ. 11,400-11,500,
పశ్చిమబెంగాల్ లోని బెల్గా, ఖరగ్ పూర్ ప్రాంతాలలో వారంలో 4-5 వాహనాల ఎర్ర నువ్వుల అమ్మకంపై క్లీన్ సరు కు రూ. 9300-10,000, అన్-క్లీన్ సరుకు రూ. 8500-8600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఈరోడ్ కోసం రవాణా అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో ఎసిల నుండి 2-3 వాహనాల అమ్మకంపై రూ. 9400-9700 మరియు కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో ఎర్రనువ్వులు రూ. 10,000-10,500, నరసరావు పేట, సత్తెనపల్లి ప్రాంతాలలో రూ. 9200-10,000 ప్రతి క్వింటాలు మరియు ఒంగోల్ లో 10,300-10,400, బద్వేల్ లో విరుధ్ నగర్ డెలివరి (75 కిలో లు) జిఎస్టి సహా రూ. 8200, ఈరోడ్ డెలివరి రూ. 8200, స్థానికంగా రూ. 10,000 (ప్రతి క్వింటాలు) ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు