నాణ్యమైన నువ్వులకు ధరల మద్దతు

 


 ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 23 నాటికి దేశంలో నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13.20 ల.హె. నుండి పెరిగి 13.35 హెక్టార్లు, గుజరాత్ లో 1,00,496 హెక్టార్ల నుండి తగ్గి 72,121 హెక్టార్లకు పరిమితం కాగా ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని మధ్య ప్రదేశకు చెందిన గ్వాలియర్, డబ్రా, ధితియా ప్రాంతాలలో సంతృప్తికరంగా విస్తరించింది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. తద్వారా సీజన్ తొలి నాళ్లలో దూసుకుపోయే ధరలు అటు తర్వాత చల్లబడగలవని సంకేతాలు అందుతున్నాయి.


గుజరాత్ లోని అన్ని నువ్వుల ఉత్పాదక కేంద్రాలలో గత వారం వర్షాలు కురిసినందున రాబడులు తగ్గి రాబడులు 5-7 వేల బస్తాలకు పరిమితం కాగా పండుగల సీజన్ డిమాండ్ నెలకొన్నందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 400-500 వృద్ధి చెందింది. అయితే వంటనూనెల ధరలు తగ్గినందున ఆయిల్ కండిషన్ సరుకు చౌక ధరతో అమ్మకమవుతున్నది. గుజరాత్ లో నాణ్యమైన తెల్లనువ్వులు రూ. 12,000-12,300, మీడియం రూ. 11,800-11,950, యావరేజ్ రూ. 11,700-11,800 మరియు నల్లనువ్వులు జడ్-బ్లాక్ రూ. 12,875 -13,500, మీడియం రూ. 11,550 - 12,500, క్రషింగ్ సరుకు రూ. 8500-9250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో హళ్లింగ్ నువ్వులు రూ. 12,300 -12,400, కాన్పూర్ లో హళ్లింగ్ సరుకు రూ. 12,600-12,800, ముంబై లో తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు సార్టెక్స్ రూ. 13,200, ముంద్రా డెలివరి రూ. 13,000, గ్వాలియర్ లో హళ్లింగ్ సరుకు బెస్ట్ రూ. 12,600-12,700, తెల్లనువ్వులు 99.1 రకం రూ. 12,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మధ్య ప్రదేశ్ లోని నిమ లో గత వారం 500 బస్తాల యాసంగి నువ్వుల రాబడిపై తెల్లనువ్వులు నాణ్యమైన సరుకు రూ. 11,900-12,000, మీడియం రూ. 11,600-11,700, యావరేజ్ సరుకు రూ. 11,300-11,400 మరియు

 తెలంగాణలోని నిజామాబాద్, మెట్ పల్లి ప్రాంతాలలో రూ. 12,000-12,500, తమిళనాడులోని నువ్వుల ఉత్పాదక కేంద్రాలలో ఎర్ర నువ్వులు రూ. 9350-12,500, నల్లనువ్వులు రూ. 10,800-11,300,

 కర్ణాటకలోని కుస్తగి మరియు పరిసర ప్రాంతాలలో కలిసి వారాంతపు సంతలో 1000-1500 బస్తాల సరుకు రాబడి పై తెల్లనువ్వులు రూ. 11,000-11,400, చిత్ర దుర్గ్ లో 9400-11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపార మైంది.

 ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల ఎసి సరుకు రూ. 9700-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపార మై తాడేపల్లిగూడెం, సామర్లకోట ప్రాంతాల కోసం మరియు బద్వేలు సరుకు విరుధ్ నగర్ డెలివరి 75 కిలోల బస్తా జిఎస్టి కలిపి రూ. 8700, ఈరోడ్ డెలివరి రూ. 8300 ధరతో వ్యాపారమైంది.కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో నువ్వులు స్థానికంగా రూ. 10,200-10,870, నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో ఎర్ర నువ్వులు స్థానికంగా రూ. 9400-10,000,ఒంగోలులో రూ.11,000 ప్రతి క్వింటాలు మరియు బద్వేలు సరుకు విరుధ్ నగర్ డెలివరి 75 కిలోల బస్తా జిఎసీతో రూ. 8700, ఈరోడ్ డెలివరి రూ. 8300 ధరతో వ్యాపారమైంది.

 పశ్చిమబెంగాల్ లోని బెల్టా, ఖరగ్ పూర్ ప్రాంతాలలో వారంలో 5-6 వాహనాల సరుకు అమ్మకంపై క్లీన్ సరుకు రూ.9500 -10,000, అన్-క్లీన్ సరుకు రూ. 8500- 8800 ధరతో వ్యాపారమై ఈరోడ్ కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog