తెలంగాణ లో వరికి ప్రత్యామ్నయంగా నువ్వుల సేద్యం సాధ్యమేనా

 



12-10-2021

రాష్ట్రంలో పండించే మొత్తం పంటను కొనుగోలు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కారు స్పష్టమైన సంకేతాలిచ్చింది. తద్వారా యాసంగి వరి స్థానంలో నువ్వులు లాంటి ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం రైతులకు సలహా ఇస్తోంది. ఇందుకోసం రైతులకు అవగాహన పెంపొందించేందుకు వ్యవసాయ అధికారులు సన్నద్ధమవుతున్నారు.


వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టినట్లయితే, కనీస మద్దతు ధర గిట్టుబాటు కాగలదా అన్నదే రైతుల మదిని తొలుస్తున్న ప్రశ్న. ఈ అంశంపై రైతులు స్పష్టమైన హామీ ఇవ్వలేక పోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్ కు అభ్యుదయ రైతులు గడిచిన మూడు సంత్సరాలుగా రబీ వరి సేద్యానికి బదులు నువ్వుల సేద్యం చేపడుతున్నారు. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వీరు ఈసారి కూడా నువ్వుల సేద్యమే చేపట్టే అవకాశం ఉంది. కావున ఇత ర రైతులు కూడా నువ్వుల సేద్యం చే పట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది ఎకరాకు 4.80 బస్తాల దిగుబడి రాణించగా రూ. 52,700 గిట్టుబాటయింది. నువ్వుల సేద్యం కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. కామన రాబోయే పంట నువ్వులకే మొగ్గు చూపే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు