లభించిన సమాచారం ప్రకారం రాబోవు రోజులలో తమిళనాడు, తెలంగాణ మరియు గుజరాత్లలో కొత్త రబీ సీజన్ నువ్వుల రాబడులు ప్రారంభమయ్యే అవకాశం కలదు మరియు ఈ ఏడాది ఉత్పత్తి పెరిగే అవకాశం కలదు. దీనితో కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు పరిమితంగా ఉన్నందున ధరలు స్థిరంగా ఉన్నాయి. వారాంతంలో వంటనూనెల ధరలలో మందకొడి కారణంగా నువ్వులనూనెకు గిరాకీ తక్కువగా ఉంది.
రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలీ, శ్రీగంగానగర్ తో పాటు పరిసర ప్రాంతాలలో దినసరి 4 వేల బస్తాల తెల్ల నువ్వులు మరియు 3 వేల బస్తాల గజ్జర్ నువ్వుల రాబడిపై కొత్తతెలుపు 99.1 రకం రూ. 10400-10500, 98.2 రకం రూ. 10200-10300, 95.5 రకం రూ. 10000-10200 మరియు గజ్జర్ నువ్వులు రూ. 9200-9500 ధరతో వ్యాపారమయింది.
మధ్య ప్రదేశ్లోని డబ్రా, దతియా, గ్వాలియర్ ప్రాంతాల హల్లింగ్ సరుకు రూ.10400-10500, ఆగ్రా లో హల్లింగ్ సరుకు ప్రతి 75 కిలోల బస్తా రూ.8200 ( జిఎస్టి సహా) మరియు కాన్పూర్లో రూ. 10600-10700, 99.1 గుజరాత్ రకం రూ. 10550-11000, సార్టెక్స్ రకం ముంద్రా డెలివరీ రూ. 13500,ముంబాయి డెలివరీ రూ. 13600 ధరతో వ్యాపారమై ఈరోడ్ కోసం రవాణా అయింది. నిమచ్లో గతవారం 500-600 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 9400-9800, మీడియం రూ. 8700-9100, యావరేజ్ రూ. 8300-8400 ధరతో వ్యాపారమయింది.
గుజరాత్లోని రాజ్కోట్, జూనాఘడ్, అమ్రేలీ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో వారంలో 4-5 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెలుపు రకం రూ. 10800-11250, మీడియం రూ.10500-10600, యావరేజ్ రూ. 10350-10600 మరియు నల్ల నువ్వుల రాబడిపై జెడ్-బ్లాక్ రూ. 12000–12875, యావరేజ్ రూ.9500-11250, క్రషింగ్ రకం రూ. 6500-8000 ప్రతిక్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.
సత్తెనపల్లి, నరసారావుపేట, కడప, రాజంపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ. 9800-10000, హల్లింగ్ రకం తమిళనాడు డెలివరీ రూ. 10200 ప్రతిక్వింటాలు మరియు చిత్తూరు ప్రాంతంలో గతవారం 1 లారీ కొత్త నువ్వుల రాబడిపై రూ. 7400-8400, పెద్దాపురం ప్రాంతపు సరుకు రూ. 6900-7100 మరియు గిద్దలూరులో 2 లారీల రాబడిపై రూ. 10400 ధరతో వ్యాపారమయింది.
పశ్చిమబెంగాల్ లోని బెల్టా ప్రాంతంలో ( ప్రతి 100 కిలోలు జిఎస్టి సహా) మైక్రో క్లీన్ నువ్వులు ఈరోడ్ డెలివరీ రూ.8600-9300, అన్ రూ. 7200-7300 మరియు ఒంగోలు సరుకు ప్రతి 75 కిలోల బస్తా 33 శాతం నూనె మరియు 1 శాతం ఎఫ్.ఎఫ్ కండీషన్ సరుకు రూ. 8100-8200 ధరతో వ్యాపారమయింది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు