పురోగమిస్తున్న నువ్వుల ధరలు

 


20-02-2022

దేశంలో నువ్వుల నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. ఎగుమతి డిమాండ్ నెలకొనే అంచనా మరియు ఆంధ్రప్రదేశ్లో రబీ సీజన్ సేద్యం తగ్గనున్నట్లు అందిన సంకేతాలతో స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఉపక్రమించినందున ధరలకు మద్దతు లభిస్తున్నది.ఒడిశ్శాలోని మల్కన్గిరి లో నువ్వుల పంటకు నష్టం వాటిల్లినందున రాబడులు తగ్గి ప్రతి రోజు 200 బస్తాల సరుకు రాబడిపై ఆన్-గ్రేడ్ రూ. 8200-8400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై జగదల్పూర్లో నిల్వ కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని ముత్తూరు, శివగిరి ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు మార్చి నుండి ప్రారంభం కాగలవని తెలుస్తోంది.





రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పొలి, శ్రీగంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు కేవలం 5 వేల బస్తాల తెల్లనువ్వులు మరియు 3 వేల బస్తాల గజ్జర్ నువ్వుల రాబడిపై తెల్లనువ్వులు 99.1 రూ.10,600-10,700, 98.2 రకం సరుకు రూ. 10,400-10,500, 95.5 సరుకు రూ. 9600-9900, గర్ నువ్వులు రూ. 9100-9300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గత వారం మధ్యప్రదేశ్లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హళ్లింగ్ సరుకు రూ. 10,800-10,900, కాన్పూర్, ఆగ్రాలో రూ. 10,700-10,800, 99.1 సరుకు గుజరాత్ రకం రూ. 11,200-11,300, సార్టెక్స్ రూ. 11,700-11,800, ముంద్రా డెలివరి రూ. 11,500-11,600, నీమచ్లో గత వారం 400-500 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ.9500-9800, మీడియం రూ. 8850-9200, యావరేజ్ సరుకు రూ. 8500-8650 ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. 

గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, అమ్రేలి మరియు 1 . పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 3-4 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన - తెల్ల నువ్వులు రూ.10,600-10,850, మీడియం రూ.10,350-11,500, • యావరేజ్ రూ. 9850-10,250 మరియు 2 వేల బస్తాల నల్లనువ్వులు ఆడ్ బ్లాక్ రూ. 12,000-13,100, మీడియం రూ. 10,000-11,750, క్రషింగ్ రకంరూ. 6500-8000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్నాటకలోని ముదగల్, అరిసికేరి, కల్బుర్గి, చిత్రదుర్గ్, మైసూరు ప్రాంతాలలో • 75 కిలోల బస్తా నాణ్యమైన సరుకు తమిళనాడు డెలివరి రూ. 7300-8500 మరియు

  ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి, నరసరావుపేట, కడప, రాజంపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ. 10,000-10,200, హళ్లింగ్ నరుకు తమిళనాడు డెలివరి రూ. 10,300, తూర్పు గోదావరి, చిత్తూరు ప్రాంతాలలో గత వారం 3-4 వాహనాల నువ్వుల రాబడిపై రూ.8500, పెద్దాపురం సరుకు రూ. 7100, గిద్దలూరులో 2-3 వాహనాలు రూ. . 10,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

పశ్చిమ బెంగాల్ లోని బెల్టా ప్రాంతంలో మైక్రో-క్లీన్ ఈరోడ్ డెలివరి రూ. 8500-9350 జిఎస్టితో, ఆన్-క్లీన్ రూ. 7200–7350 ప్రతి క్వింటాలు మరియు ఒంగోలు సరుకు 75 కిలోల బస్తా 33. శాతం నూనె, 1 శాతం ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు రూ. 8100-8300 (జిఎస్టితో) ధరతో వ్యాపారమై తమిళనాడులోని ఈరోడ్ కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం