పెరుగుతున్న నువ్వుల రాబడులు - విస్తృతమవుతున్న రబీ సేద్యం

 


 ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లలో దినసరి 20 వేల బస్తాల రాబడి అవుతోంది. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా సరుకు నిమ్ముతో పాటు డిస్ కలర్ కావడంతో ధరలు తగ్గి గ్వాలియర్లో 99.1 రకం రూ. 12,800-12,900, హల్లింగ్ రూ. 12,500-12,600, ఆగ్రాలో హళ్లింగ్ సరుకు రూ. 12,400-12,500, కాన్పూర్ లో హళ్లింగ్ సరుకు 12,600-12,800, ముంబైలో తెల్లనువ్వులు సార్టెక్స్ రూ. 13,700, ముంద్రా డెలివరి రూ. 13,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 


మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్, రాజానగర్,డబ్రా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 5 వేల బస్తాల సరుకు రాబడిపై హళ్లింగ్ సరుకు (ప్రతి 75 కిలో లు) రూ. 9000, ధరతో వ్యాపారమె విరుధ్ నగర్ కోసం రవాణా అవుతోంది. రాజస్తాన్లోని గంగాపురి సిటీ , సవాయిమాధవపూర్, లాల్ట్ ,దౌసా, పాలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 10-15 వేల బస్తాల కొత్త నువ్వుల రాబడిపై రూ. 11,800-12,500 ప్రతి క్వింటాలు మరియు విరుధ్ నగర్ డెలివరి (75 కిలోల బస్తా జిఎస్టి సహా) రూ. 9000-9100 ధరతో వ్యాపారమైంది. గుజరాత్ లో ప్రతి రోజు 6-7 వేల బస్తాల నువ్వుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 12,400-12,600, మీడియం రూ. 12,150-12,300, యావరేజ్ సరుకు రూ. 11,900-12,000 మరియు 2 వేల బస్తాల నల్లనువ్వులు జడ్ బ్లాక్ రూ. 12,875-13,600,మీడియం రూ. 11,625-12,625, క్రషింగ్ సరుకు రూ. 8500-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులో ఎరుపు రకం రూ. 11,000-12,500, నలుపు సరుకు రూ. 10,500–12,500, కర్ణాటకలోని కుస్తగి, లింగసూర్, చిత్రదుర్గ్ మరియు పరిసర ప్రాంతాలలో తెల్లనువ్వులు రూ. 11,250–11,500 మరియు పశ్చిమబెంగాల్ లోని బెల్టా, ఖరగ్ పూర్ ప్రాంతా లలో వారంలో 1-2 లారీల గ్రీష్మకాలం ఎర్రనువ్వులు అన్-క్లీన్ సరుకు రూ. 9500, క్లీన్ సరుకు రూ. 10,300-10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఈరోడ్ కోసం రవాణా అవుతున్నది. తెలంగాణలోని నిజామాబాద్, మెట్ పల్లి ప్రాంతాలలో నిల్వ తెలుపు రకం సరుకు రూ. 12,000-12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి 2 వాహనాల సరుకు అమ్మకంపై రూ. 10,100-10,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, సామర్లకోట ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది. కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో ఎర్ర నువ్వులు స్థానికంగా రూ. 10,500, నరసరావుపేట, సత్తెనపల్లిలో రూ. 10,000-11,000, ఒంగోలులో రూ. 11,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog